E-Paper
Advertisement

Delimitation Protest: అన్నట్టుగానే తమిళనాడులో.. డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

Delimitation Protest: అన్నట్టుగానే తమిళనాడులో.. డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్
Advertisement

Delimitation Protest: పార్లమెంటు ముందుకు గురువారం డీలిమిటేషన్ బిల్లు రానుండడంతో దక్షిణాది రాష్ట్రాలు తమ పోరును ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి స్టాలిన్ తగులబెట్టారు. ఇకపై తమ పోరును కంటిన్యూ చేస్తామని చెప్పకనే ఆయన చెప్పారు.

పార్లమెంటు ముందుకు డిలిమిటేషన్ పేపర్లు

Advertisement

గురువారం పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్-డీలిమిటేషన్ బిల్లులు వచ్చాయి. దీన్ని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు నష్టం జరుగుతుందని చెబుతున్నాయి. అయినా సరే కేంద్రం ముందుకు వెళ్లడాన్ని తూర్పార బట్టాయి. దీన్ని నిరసిస్తూ చెన్నైలో ఆందోళనకు దిగింది అధికార డీఎంకె ప్రభుత్వం.

నల్ల దుస్తులు ధరించిన ఆ పార్టీ నేతలు తన నిరసనను కేంద్రానికి తెలిపారు. చెన్నైలో గురువారం ఉదయం సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ డాక్యుమెంట్లను తగులబెట్టారు. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతిఘటన జ్వాల గతంలో ఢిల్లీని దహించి వేసిందన్నారు. మళ్లీ ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టి మరో జ్వాలను రగిలించినట్లు ఆయన ప్రస్తావించారు.

Advertisement

డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

ఈ మంటలు కేంద్రంలోని బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని చెప్పకనే చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం స్టాలిన్. ఈ బిల్లులు పార్లమెంటుకు వస్తే 1960 నాటి డీఎంకెను చూస్తారని హెచ్చరించారు. తమిళ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ధ్వజమెత్తారు.

అన్నట్లుగా గురువారం ఉదయం బిల్లు పత్రాలను తగులబెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు తమిళనాడు ప్రజలను వారి సొంత గడ్డపైనే శరణార్థులుగా మారుస్తుందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీని ఫాసిస్టులతో పోల్చారు. ఈ జ్వాల ఇప్పుడు ద్రవిడ భూమి అంతటా వ్యాపిస్తుంది ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

ALSO READ: నియోజకవర్గాల పునర్విభజన.. సీఎం చంద్రబాబు క్లారిటీ

విజృంభిస్తుంది.. ఉగ్రరూపం దాల్చుతుంది, బీజేపీ అహంకారాన్ని అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో #SayNoToNDA” అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. రానున్న మూడు రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×