E-Paper
Advertisement

పుండు మీద కారం.. బీజేపీ య‌వ్వారం..! తేజ‌స్వీని స‌మ‌ర్థించి.. త‌మ అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని..!

పుండు మీద కారం.. బీజేపీ య‌వ్వారం..!  తేజ‌స్వీని స‌మ‌ర్థించి.. త‌మ అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని..!
Advertisement

అగ్గి రాజుకుంటే చ‌ల్లార్చాల్సింది పోయి.. మ‌రింత‌గా అగ్నికి ఆజ్య‌మే పోశాడు త‌న మాట‌ల‌తో బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రాంచంద్రారావు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ తేజ‌స్వీ పార్ల‌మెంటులో తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్ అగ్గి రాజేసింది.అస‌లు అది సంద‌ర్భ‌మే కాదు. అన‌వ‌స‌ర‌మైన టాపిక్‌ను ఎత్తుకుని.. తెలంగాణ బీజేపీకి బుర‌దపూసినంత ప‌ని చేశాడా ఎంపీ. డీలిమిటేష‌న్ చ‌ర్చ‌కు ప‌క్క‌కు పోయి.. తెలంగాణ‌లో ఇప్పుడు తేజ‌స్వీ మాట‌ల విషంపై విరుచుకుప‌డుతున్నారు.

వాస్త‌వంగా ఆ పోలిక క‌రెక్టు కాదు. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు, త‌న వాగ్దాటికి మ‌రింత ప‌దును పెట్టేందుకు తెలంగాణ ఏర్పాటు ఇష్యూను మ‌ధ్య‌లో త‌న ప్ర‌సంగంలో తీసుకొచ్చాడు తేజ‌స్వీ. బ్రిటీష్‌వాళ్లు భార‌త్‌, పాకిస్తాన్‌ను విభ‌జించిన‌ట్టు.. ఏపీ నుంచి తెలంగాణ‌ను విడ‌దీశార‌న్నాడు. ఇది స్ప‌ష్టంగా ఉంది. కానీ దీన్ని స‌మ‌ర్థించే క్ర‌మంలో మీడియా ముందుకు వ‌చ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద్రరావు … న‌ష్ట నివార‌ణేమో గానీ మ‌రింత ర‌చ్చ ర‌చ్చ చేసి పోయాడు. ఎంపీలు మాత్రం దీని మీద మౌనం వీడ‌టం లేదు. కాంగ్రెస్ ఓ వైపు బీజేపీ మీద భ‌గ్గుమంటున్న‌ది.

Advertisement

బీఆరెస్ కూడా దాడి మొద‌లు పెట్టింది. పార్ల‌మెంటు నుంచి ఈ మాట‌ల‌ను తొల‌గించాల‌, ఆ ఎంపీ స‌భ్య‌త్వాన్నే ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ల‌ను కూడా చేశాడు పొన్నం ప్ర‌భాక‌ర్‌రావు. ఇంత‌లా భావోద్వేగ‌మైన వాతావ‌ర‌ణంలో ఏదో ఒక‌టి మాట్లాడి వివాదాన్ని సైలెంట్ చేద్దామ‌ని వ‌చ్చిన అధ్య‌క్షుడు.. మ‌రింత‌గా దీన్ని వివాదం చేసి .. స‌మ‌ర్థింపు క్ర‌మంలో అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని పోయార‌నే విమ‌ర్శలు వెల్లువెత్తాయి. తేజ‌స్వీ మాట్లాడిన నేప‌థ్యాన్ని వ‌క్రీకించి.. కొంచెం లేని సంద‌ర్భాన్ని జోడించి ఏదో చెప్ప‌బోయి త‌ప్ప‌ట‌గులు వేస్తున్న‌ట్టే మాట్లాడి.. విమ‌ర్శించిన రాజ‌కీయ నేత‌ల‌నే త‌ప్పుబ‌ట్టి.. తిట్టి.. హిత‌బోధ చేసి పోయాడు. ఇది ప‌రిస్థితిని మ‌రింత‌గా తీవ్రం చేసింది.

పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టే చేసింది. ఎంపీలు సైతం సైలెంట్‌గా తెర వెనుకే ఉండ‌టం తెలంగాణ జ‌నానికి మ‌రింత కోపాన్నే తెప్పించిన‌ట్ట‌య్యింది. ఇందులో ఏ ఒక్క ఎంపీనైనా బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఇది త‌ప్పు వ్యాఖ్య‌లు.. అలా మాట్లాడాల్సింది కాదు.. అని స్పందించినా స‌రిపోయేది. పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ ఉండేది కాదు. తెలంగాణ‌లో పార్టీని కాపాడుకునేదాని క‌న్నా .. జాతీయ పార్టీ, కేంద్రం ఏదంటే అదే క‌రెక్ట‌ని స‌మ‌ర్థించే దోర‌ణే వారికి ఇక్క‌డ మ‌రింత న‌ష్టం క‌ల‌గ‌జేసింద‌నే చెప్పాలి. ఇది ఇక్క‌డితో ఆగేలా లేదు. ఉద‌యం వ‌ర‌కు డీలిమిటేష‌న్‌పైనే విమర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ, ఆ ఎంపీ దిష్టిబొమ్మ‌లు త‌గులబెట్టేదాకా పోయింది ప‌రిస్థితి.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×