E-Paper
Advertisement

2018లో అంతరిక్షంలోకి వదిలిన టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? ఏమైంది?

2018లో అంతరిక్షంలోకి వదిలిన టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? ఏమైంది?
Advertisement

Elon Musk’s Tesla Roadster: 2018లో ప్రపంచాన్ని అబ్బుర పరిచే ఓ వినూత్న ప్రయోగం జరిగింది. స్పేస్‌ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన రెడ్ కలర్ టెస్లా రోడ్‌ స్టర్ కారును అంతరిక్షంలోకి పంపించారు. సాధారణంగా రాకెట్లలో ఉపగ్రహాలు, ప్రయోగ పరికరాలను పంపుతారు. కానీ, మస్క్ తన కారును పంపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రయోగం ఫాల్కన్ హెవీ రాకెట్ మొదటి పరీక్షలో భాగంగా జరిగింది.

2018లో ఏం జరిగిందంటే?

ఫిబ్రవరి 6, 2018న అమెరికాలోని ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోజం జరిగింది. ఆ కారు డ్రైవర్ సీటులో స్టార్‌ మ్యాన్ అనే డమ్మీని కూర్చోబెట్టారు. కారులో డేవిడ్ బోవీ పాట స్పేస్ ఆడిటీ ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. డాష్‌ బోర్డ్‌ పై ‘Don’t Panic’ అనే మెసేజ్ రాశారు. ఈ దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌ లో ప్రసారం కావడంతో కోట్లాది మంది వీక్షించారు.

ప్రస్తుతం ఆ కారు ఎక్కడ ఉందంటే?

Advertisement

ప్రస్తుతం ఆ టెస్లా కారు భూమి చుట్టూ తిరగడం లేదు. సూర్యుడి చుట్టూ ఒక పెద్ద కక్ష్యలో తిరుగుతోంది. దీనిని హీలియోసెంట్రిక్ ఆర్బిట్ అని పిలుస్తున్నారు. ఇది కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంది. మరికొన్నిసార్లు అంగారక గ్రహ కక్ష్య దాకా వెళ్తుంది. సూర్యుని చుట్టూ ఒకసారి పూర్తిగా తిరగడానికి దాదాపు 557 రోజులు పడుతుంది. ఈ కారు ప్రస్తుతం భూమి నుంచి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. అయితే, ఇది మన కళ్లకు కనిపించదు, ఎందుకంటే అది చాలా దూరంలో ఉంది. చిన్నదిగా కనిపిస్తుంది.

ఇప్పుడు ఆ కారులో ఎలాంటి జీవం లేదు. బ్యాటరీలు చాలా కాలం క్రితమే పని చేయడం ఆపేశాయి. కెమెరాలు కూడా పని చేయడం లేదు. స్టార్‌మ్యాన్ మాత్రం సైలెంట్ గా డ్రైవర్ సీట్ లోనే కూర్చుని ఉన్నాడు. అంతరిక్షంలో తేలియాడుతున్న ఈ కారు ఒక రకంగా మానవ సృష్టి ఎంత దూరం వెళ్లగలదో చూపించే చిహ్నంగా మారింది.

భూమ్మీదికి తిరిగి వస్తుందా?

Advertisement

ఈ టెస్లా కారు భూమికి తిరిగి వస్తుందా? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. అయితే, ఈ కారు సమీప భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే అవకాశం లేదు. లక్షల సంవత్సరాల పాటు సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.  చాలా ఏళ్ల తర్వాత  ఇతర గ్రహాలకు దగ్గరయ్యే అవకాశం ఉంది.

ఎందుకు ఈ ప్రయోగం చేశారు?

ఈ ప్రయోగం వెనుక ముఖ్య ఉద్దేశం ఫాల్కన్ హెవీ రాకెట్ సామర్థ్యాన్ని నిరూపించడం మాత్రమే. భారీ బరువును అంతరిక్షంలోకి పంపగలిగే శక్తి ఉందని స్పేస్ ఎక్స్ చూపించాలనుకుంది. కారును పంపడం వల్ల ఈ ప్రయోగం మరింత ఆసక్తిని కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. స్పేస్‌ ఎక్స్‌ కు మంచి గుర్తింపు తెచ్చింది.

ఆ కారు ఎలా ట్రాక్ చేయాలంటే?

ఇప్పుడు కూడా ఈ కారును ట్రాక్ చేయడానికి www.whereisroadster.com, theskylive.com/roadster-info లాంటి కొన్ని వెబ్‌ సైట్లు ఉన్నాయి. వాటి ద్వారా కారు ఎక్కడ ఉందో, ఎంత వేగంతో ప్రయాణిస్తుందో తెలుసుకోవచ్చు. నాసా డేటాను ఆధారంగా తీసుకుని ఈ సమాచారం అప్డేట్ అవుతూ ఉంటుంది. టెస్లా రోడ్‌స్టర్ ఇప్పుడు అంతరిక్షంలో  నిశ్శబ్ద ప్రయాణికుడిగా కొనసాగుతోంది. మానవ ఆవిష్కరణలకు ఒక ప్రతీకగా నిలిచింది.

Read Also: ఫస్ట్ ఇండియన్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. వావ్.. వైవ్ ఈవా ఎంత బాగుందో!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×