E-Paper
Advertisement

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో
Advertisement

ZEE5 Upcoming Movies: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మంచి సినిమాలు మాత్రమే ఉంటే సరిపోదు. లైనప్ లో వరుసగా క్రేజీ కంటెంట్ ఉండాలి. అందుకే ఇప్పుడు అన్ని ఓటీటీ సంస్థలు భారీ లైనప్‌లతో ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ZEE5 చేసిన తాజా ప్రకటన మాత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఒకటి రెండు సినిమాలు కాదు.. స్టార్ హీరోల భారీ చిత్రాలు, కొత్త ఒరిజినల్ వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు, ఇంకా పలు భాషల్లో స్పెషల్ కంటెంట్‌తో పెద్ద ప్లాన్‌ను ప్రకటించింది. దీంతో రాబోయే నెలల్లో ZEE5లో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

తెలుగులో సినిమాల జాతర

ఈసారి జీ5 కేవలం ఏదో ఒక లాంగ్వేజ్ లో కంటెంట్‌కే పరిమితం కాలేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ… ఇలా మొత్తం ఏడు భాషల్లో భారీ స్థాయిలో కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు మాత్రమే కాదు.. లైవ్ స్పోర్ట్స్ కంటెంట్ కూడా ఇందులో భాగం కానుంది. అంటే ఒక్క ప్లాట్‌ఫామ్‌లోనే అన్ని రకాల వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

Advertisement

అయితే తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నది మాత్రం టాలీవుడ్ సినిమాల లైనప్. థియేటర్లలో విడుదలైన తర్వాత జీ5లోకి రానున్న చిత్రాల్లో VenkyAnil5 ఒకటి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK111 కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ డిజిటల్ హక్కులను కూడా జీ5 దక్కించుకుంది.

సినిమాలతో మాత్రమే కాదు… ఒరిజినల్ కంటెంట్‌తో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జీ5 సిద్ధమవుతోంది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘శ్రీమతి’ అనే ఫీల్‌గుడ్ వెబ్‌సిరీస్ ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అబ్జెక్షన్ మై లార్డ్’ కోర్ట్‌రూమ్ డ్రామాగా రానుంది. గతంలో మంచి ఆదరణ పొందిన ‘జయం నిశ్చయమురా’ సెలబ్రిటీ టాక్ షో కూడా కొత్త సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

అయితే ఇప్పటివరకు ఈ సినిమాలు, సిరీస్‌ల విడుదల తేదీలను ప్రకటించలేదు. కానీ అధికారికంగా లైనప్‌ ను ప్రకటించడంతో ఒక్కో ప్రాజెక్ట్‌ కు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు కంటెంట్‌పై జీ5 ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఓటీటీ ప్రేక్షకులకు శుభవార్త అనే చెప్పాలి.

ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్టార్ హీరోల సినిమాలు, ఒరిజినల్ వెబ్‌ సిరీస్‌లు, రియాలిటీ షోలు వరుసగా చూడాలనుకునే వారికి జీ5 రాబోయే రోజుల్లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ ఇవ్వబోతోంది. వెంకటేష్, బాలకృష్ణ, నాగచైతన్య సినిమాలతో పాటు కొత్త తెలుగు ఒరిజినల్స్ కూడా లైనప్‌ లో ఉండటంతో ఇప్పుడు అందరి చూపు జీ5 ప్రకటించబోయే రిలీజ్ డేట్స్‌పైనే ఉంది.

Read Also: చీకటి గుహలో ఐదుగురు ఫ్రెండ్స్… వెంటాడే రాక్షస చేప.. తెలుగులో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×