// // Year Ender 2025 : 2025 లో వచ్చిన బెస్ట్ ఇండియన్ సినిమాలు -->
E-Paper
Advertisement

Year Ender 2025 : 2025 లో వచ్చిన బెస్ట్ ఇండియన్ అండర్రేటెడ్ సినిమాలు… ఒక్కోటి ఒక్కో ఓటీటీలో

Year Ender 2025 : 2025 లో వచ్చిన బెస్ట్ ఇండియన్ అండర్రేటెడ్ సినిమాలు… ఒక్కోటి ఒక్కో ఓటీటీలో
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరంలో భారీ స్థాయి సినిమాలెన్నో రిలీజ్ అయ్యాయి. కానీ అందులో భారీ అంచనాలతో వచ్చి, బాక్స్ ఆఫీసు దగ్గర బొక్క బోర్లా పడ్డ సినిమాలు కూడా ఉన్నాయి. ట్రెండ్ ను పక్కన పెట్టి ప్రయోగాలతో ఈ ఏడాదిని మూవీ లవర్స్ కు చీరస్మరణీయంగా చేయాలనుకున్న మేకర్స్ కు ఎదురు దెబ్బ తగిలింది. కానీ ఈ సినిమాలు ఓటీటీలలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మరి 2025 లో వచ్చిన మోస్ట్ అండర్రేటెడ్ సినిమాలు ఏంటి? అవి ఏ ఓటీటీలలో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

రెట్రో (Retro)

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మూవీ ‘రెట్రో’. గ్యాంగ్‌స్టర్ డ్రామాను ప్రేమకథతో మిళితం చేస్తూ రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో నిరాశ పరిచింది. కానీ సూర్య అభిమానులు మాత్రం ఈ మూవీని బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీకి ఐఎండీబీలో 6.6 రేటింగ్ ఉంది. ఈ మూవీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

రేఖాచిత్రం (Rekhachithram)

Advertisement

జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించిన ఈ మూవీ కథ 1985లో అదృశ్యమైన యువతి చుట్టూ తిరుగుతుంది. ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి (ఆసిఫ్ అలీ) ఈ పాత రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. గతం-వర్తమానాలను మిళితం చేస్తూ మలయాళ సినిమా చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్‌ ఇది. SonyLIVలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

నరివెట్ట (Narivetta)

కేరళలోని మోస్ట్ కాంట్రావర్షియల్ కథాంశంతో రూపొందిన మూవీ ఇది. వయనాడ్‌లో గిరిజనుల నిరసనల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సున్నితమైన అంశాలను అద్భుతంగా చూపించారు. 2025లో చాలా తక్కువ సినిమాలు అన్యాయాన్ని ఇంత ప్రత్యక్షంగా, ధైర్యంగా ప్రస్తావించాయి. SonyLIV ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.

సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (Superboys of Malegaon)

Advertisement

రీమా కాగ్టి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ హార్ట్ టచింగ్ డ్రామాలో మాలేగావ్‌లో వివాహ వీడియోగ్రాఫర్ నుండి గ్రాస్‌రూట్ ఫిల్మ్ మేకర్‌గా మారిన్ నాసిర్ షేక్ ప్రయాణాన్ని చూడవచ్చు. ఫిల్మ్ మేకింగ్, స్నేహాలు, పేదరికం మధ్య హీరో మనుగడ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. Amazon Prime Videoలో ఆ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

చిడియా (Chidiya)

ముంబైలోని ఇరుకైన గల్లీలో జరిగే ఈ సున్నితమైన చిత్రం, బ్యాడ్మింటన్ ఆడాలని కలలు కనే ఇద్దరు యువ సోదరుల కథ. Amazon Prime Videoలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లిస్ట్ లో ఇంకా ది మెహతా బాయ్స్, కాళిధర్ లాపాట, స్టోలెన్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

 

Read Aslo : OTT Movie : ఆడినోళ్లకు ఆడినంత… బెట్టింగ్ ఉచ్చులో మిడిల్ క్లాస్ అబ్బాయి… ఓటీటీలో అదరగొడుతున్న కన్నడ యాక్షన్ మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×