E-Paper
Advertisement

Wonder Man on OTT : ఇండియాలోకి ‘వండర్ మ్యాన్’ సైలెంట్ ఎంట్రీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Wonder Man on OTT : ఇండియాలోకి ‘వండర్ మ్యాన్’ సైలెంట్ ఎంట్రీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

Wonder Man on OTT : ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో వండర్ సిరీస్ ‘వండర్ మ్యాన్’ (Wonder Man) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. మార్వెల్ స్టూడియో నుంచి వచ్చిన ఈ సిరీస్ అసలు సౌండ్‌ట్రాక్ ఇంగ్లీషులో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది భారతీయ ప్రేక్షకుల వీక్షించేందుకు హిందీ డబ్‌ను కూడా చేర్చింది. ఇక ఈ సిరీస్ మార్వెల్ కథల్లో ఒక సరికొత్త ప్రయోగాత్మకమైన కామెడీగా నిలిచింది. ఇందులో సైమన్ విలియమ్స్ అనే హాలీవుడ్ నటుడి కష్టాలను కామెడిగా చూపిస్తుంది ఈ సిరీస్. పిల్లలతో కలసి ఈ సిరీస్ ను ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

మార్వెల్ టెలివిజన్ రూపొందించిన ‘వండర్ మ్యాన్’ సిరీస్ 2026 జనవరి 28 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్న సిరీస్ ను ఈరోజు నుంచి చూసి ఆనందించవచ్చు. ఇది ఒక సాధారణ నటుడు, ఒక సూపర్ హీరో సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి, నిజంగానే సూపర్ పవర్స్ పొందితే అతని జీవితం ఎలా మలుపు తిరిగింది అనేదే ఈ కథ. ప్రధాన పాత్రలో యాహ్యా అబ్దుల్-మతీన్ నటించగా, మనందరికీ తెలిసిన ‘ట్రెవర్ స్లాటరీ’ పాత్రలో బెన్ కింగ్స్లీ అదరగొట్టారు. ఈ సిరీస్ మార్వెల్ స్పాట్‌లైట్ బ్యానర్‌లో వచ్చింది. అంటే పాత మార్వెల్ సినిమాలు చూడకపోయినా ఈ సిరీస్‌ను హాయిగా అర్థం చేసుకోవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సైమన్ విలియమ్స్ అనే వ్యక్తి హాలీవుడ్‌లో ఒక గొప్ప నటుడు కావాలని కలలు కంటూ, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో, మార్వెల్ ప్రపంచంలో ‘వండర్ మ్యాన్’ అనే పాత సూపర్ హీరో సినిమాను రీమేక్ చేయడానికి స్టూడియోలు ప్రయత్నిస్తుంటాయి. సైమన్ ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇస్తాడు. అయితే అనుకోకుండా జరిగిన ఒక ప్రయోగం వల్ల సైమన్ శరీరంలోకి ఒక వింత శక్తి వస్తుంది. దీనివల్ల అతనికి అపారమైన బలం, గాలిలో ఎగిరే శక్తి లభిస్తుంది.

మొదట తన శక్తులను చూసి సైమన్ భయపడతాడు. కానీ తర్వాత వాటిని తన నటనకు ప్లస్ పాయింట్‌గా వాడుకోవాలని చూస్తాడు. ఇక్కడే కథలో ట్విస్ట్ వస్తుంది. అప్పటికే జైలు నుండి విడుదలైన ట్రెవర్ స్లాటరీ (ఐరన్ మ్యాన్ 3 ఫేమ్) సైమన్‌కు నటనలో గురువుగా, స్నేహితుడిగా మారతాడు. మరోవైపు సైమన్ సోదరుడు ఎరిక్ విలియమ్స్ (గ్రిమ్ రీపర్), సైమన్ శక్తులను తప్పుదారిలో వాడాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో సైమన్ ఇబ్బందుల్లో పడతాడు. తన కెరీర్‌ను కాపాడుకోవాలా ? లేక తన శక్తులతో ప్రపంచాన్ని రక్షించాలా ? అనే అంశాలతో మిగతా కథ ఉంటుంది. వండర్ మ్యాన్ ఈ సంవత్సరం మొదటి మార్వెల్ సిరీస్‌గా వచ్చి, విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది.

Advertisement

Read Also : వింత మనిషి రాకతో వల్లకాడుగా మారే ఊరు… అంతుచిక్కని రోగంతో అలాడిపోయే జనం

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×