E-Paper
Advertisement

Luxury Van Rental Service: అద్దెకు లగ్జరీ వ్యాన్లు.. మీకూ రెంట్ కు కావాలా?

Luxury Van Rental Service: అద్దెకు లగ్జరీ వ్యాన్లు.. మీకూ రెంట్ కు కావాలా?
Advertisement

Avis India Luxury Van Rental Service: చాలా మంది వేడుకల కోసం చాలా మంది వాహనాలను అద్దెకు తీసుకుంటారు. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు అన్ని రకాల వాహనాలను రెంట్ కు ఇస్తుంటాయి. తాజాగా అవిస్ ఇండియా మరో అడుగు ముందుకు వేసి, లగ్జరీ వాన్ రెంటల్స్ సర్వీసును ప్రారంభించింది. కార్పొరేట్, రిచ్ పీపుల్ ప్రయాణ అవసరాలను తీర్చడానికి డ్రైవర్ ఆధారిత మొబిలిటీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్పొరేట్ ప్రయాణం, ఎయిర్ పోర్ట్ డ్రాప్స్, సుదూర ప్రయాణాలు, కుటుంబ ప్రయాణాల కోసం ఈ సర్వీసును అందిస్తోంది. అవిస్ ఇండియా ప్రస్తుత కారు అద్దె, మొబిలిటీ పరిష్కారాల పోర్ట్‌ ఫోలియోకు ఈ కొత్త సర్వీసును యాడ్ చేసింది.

ఏ కార్లు అద్దెకు లభిస్తాయంటే?

Advertisement

అవిస్ ఇండియా ఫ్లీట్‌లో మెర్సిడెస్ బెంజ్ V క్లాస్, టయోటా వెల్‌ ఫైర్, కియా కార్నివాల్, టయోటా కోస్టర్, టయోటా కమ్యూటర్ లాంటి వాహనాలు ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ వాహనాలను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణీకుల సంఖ్య, ప్రయాణ అవసరాల ఆధారంగా వాహనాలను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వీసు ఇంట్రా సిటీ, ఇంటర్ సిటీ ప్రయాణాలకు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ సర్వీసుకు ఇంగ్లీష్ మాట్లాడే డ్రైవర్లు, బుకింగ్స్, కన్ఫర్మేషన్స్, మార్పుల కోసం ఇన్ హౌస్ టెక్నాలజీ ప్లాట్‌ ఫామ్, 24/7 కాంటాక్ట్ సెంటర్ సపోర్ట్ ఉంటుందని  అవిస్ ఇండియా వెల్లడించింది.

కెపాసిటీ, సర్వీస్ స్కోప్

Advertisement

అవిస్ ఇండియా తన లగ్జరీ వెహికిల్స్ సర్వీస్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. ఈ వ్యాన్‌లు 25 మంది ప్రయాణికులకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. “అవిస్ లగ్జరీ వాన్ రెంటల్స్ వ్యాల్యూ కంఫర్ట్,  రిలయబులిటీ, ప్రొఫెషనల్ సర్వీస్ అందిస్తుంది. కస్టమర్లకు చక్కటి సర్వీసులు అందించడమే లక్ష్యంగా ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చాం. దేశంలో అభివృద్ధి చెందుతున్న గ్రూప్ ట్రావెల్ అవసరాలను తీర్చడానికి ఈ సర్వీసులను ప్రారంభించాం.  మా పోర్ట్‌ ఫోలియోను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం. ఈ సర్వీసు 25 మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి రూపొందించబడింది. దేశ వ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులకి తీసుకొస్తున్నాం. ప్రీమియం ట్రావెలింగ్ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సర్వీసును పరిచయం చేస్తున్నాం” అని అవిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమన్ నాగర్ వెల్లడించారు. జస్ట్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకుంటే సరిపోతుందన్నారు.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన ఈవీలు, జనవరి 2026లో నెంబర్ వన్ ఈ స్కూటరే!

అటు అవిస్ ఇండియా కొత్త సర్వీస్, బిజినెస్, ఇతర ప్రయాణాలలో గ్రూప్ ట్రావెలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ సర్వీసులో వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ సర్వీసులు మరికొద్ది నెలల్లోనే విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Read Also:  ఆ రైళ్లలోకి పిల్లల నో ఎంట్రీ, దుమారం రేపుతున్న ఫ్రెంచ్ రైల్వే నిర్ణయం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×