E-Paper
Advertisement

సిటీ బ్లాస్ట్ ప్లాన్ ను ఆపడానికి పాస్ట్ లోకి… మిస్టీరియస్ మనిషి ఎంట్రీతో అడ్డం తిరిగే కథ

సిటీ బ్లాస్ట్ ప్లాన్ ను ఆపడానికి పాస్ట్ లోకి… మిస్టీరియస్ మనిషి ఎంట్రీతో అడ్డం తిరిగే కథ
Advertisement

Sci-fi Thriller: గతంలో ఏదైనా తప్పు జరిగితే, పాస్ట్ లోకి వెళ్ళి దాన్ని మారిస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం మనం. మరి ఆ ఛాన్స్ ఒక స్పై ఏజెంట్ కి వస్తే ఏ క్రిమినల్ నో లేదా జనాలని కాపాడే ఏ మిషన్ పైనో బయల్దేరుతాడు. అచ్చం అలాంటి స్టోరీతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. 2014లో విడుదలైన హాలీవుడ్ మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రీడెస్టినేషన్ (Predestination)నే ఆ మూవీ. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టైం ట్రావెల్, పారడాక్స్ థీమ్‌పై వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇథన్ హాక్, సారా స్నూక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం స్పైరిగ్ బ్రదర్స్ దర్శకత్వంలో రూపొందింది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కథ అంతా ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. కానీ ఆ ఒక్క వ్యక్తి వేర్వేరు కాలాల్లో, వేర్వేరు రూపాల్లో కనిపిస్తాడు. ఇది సాధారణ టైం ట్రావెల్ స్టోరీ కాదు… అనంతమైన లూప్, ఒక ముగింపు లేని డెస్టినీ. 1970ల న్యూయార్క్‌ లో భయంకర బాంబు పేలుళ్లు జరుగుతుంటాయి. వాటికి కారణమైన ‘ఫిజిల్ బాంబర్’ను పట్టుకోవడానికి ఒక రహస్య ప్రభుత్వ ఏజెంట్ (ఇథన్ హాక్) కాలంలో వెనక్కి ప్రయాణిస్తాడు. అతని చివరి మిషన్‌లో భాగంగా అతను ఒక బార్‌ లో కీపర్‌ గా మారి కూర్చుంటాడు.

Advertisement

ఆ బార్‌ కు ‘జాన్’ అనే ఒక యువకుడు వస్తాడు. జాన్ ఒక రచయిత. అతను తన జీవితం గురించి బార్ కీపర్‌కు చెప్పడం ప్రారంభిస్తాడు. జాన్ నిజానికి ఒకప్పుడు ‘జేన్’ అనే అమ్మాయి. అనాథాశ్రమంలో పెరిగిన జేన్ చాలా తెలివైనది. 1963లో ఆమె ఒక అపరిచితుడిని ప్రేమిస్తుంది. ఆతని వల్ల గర్భవతి అవుతుంది. కాన్పు సమయంలో ఆమెకు మగ-ఆడ రెండు జననాంగాలు ఉన్నట్లు తెలుస్తుంది. డాక్టర్లు ఆమెను పూర్తిగా మగవాడిగా జాన్‌గా మార్చేస్తారు. ఆ సమయంలో ఆమెకు పుట్టిన ఆడపాపను ఎవరో దొంగిలిస్తారు. ఈ కథ విన్న బార్ కీపర్ జాన్‌ను టైమ్ ట్రావెల్ పరికరంతో 1963కి తీసుకెళ్తాడు.

అక్కడ జాన్ తన పాత రూపం జేన్‌ను కలుసుకుని, ఆమెను ప్రేమిస్తాడు. అంటే… జేన్‌ను గర్భవతి చేసిన అపరిచితుడు మరెవరో కాదు… భవిష్యత్తు నుండి వచ్చిన జాన్. ఇక్కడి నుండి కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. బార్ కీపర్ మళ్లీ టైమ్ ట్రావెల్ చేసి, ఆ ఇద్దరికీ పుట్టిన పాపను దొంగిలించి, 1945లో అనాథాశ్రమం బయట పడేస్తాడు. ఆ పాప పెద్దదై ‘జేన్’ అవుతుంది. చివరికి ఫిజిల్ బాంబర్ ఎవరో తెలిసినప్పుడు బుర్ర పాడవుతుంది. ఆ బాంబర్ కూడా అదే వ్యక్తి. జేన్, జాన్, బార్ కీపర్, ఫిజిల్ బాంబర్, చిన్న పాప… వీరంతా వేర్వేరు వ్యక్తులు కాదు. ఒకే ఒక్క వ్యక్తి విభిన్న కాలాల రూపాలు.

Advertisement

తనే తనకు తల్లి, తండ్రి, ప్రేమికుడు, శత్రువు అయ్యే ఒక అనంతమైన లూప్ ఇది. ప్రీడెస్టినేషన్ (Predestination) గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకేసారి మన మెదడులో తిరగేసే అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇథన్ హాక్, సారా స్నూక్ నటన అద్భుతం. ఒక్కసారి చూస్తే అర్థం కాకపోవచ్చు, రెండోసారి చూస్తే మరింత షాక్ ఇస్తుంది. ప్రస్తుతం Amazon Prime Videoలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. మైండ్-బెండింగ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని డోంట్ మిస్.

Read Also : నేరస్థులను లేపేసే అమాయకపు సైకో… కామెడీతో పాటు క్రైమ్ ఉన్న కొరియన్ సిరీస్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×