E-Paper
Advertisement

ఇంగ్షీషు వోవెల్స్ తో సాగే కథ… ఓటీటీలోకి వచ్చిన తమిళ రొమాంటిక్ ఆంథాలజీ

ఇంగ్షీషు వోవెల్స్ తో సాగే కథ… ఓటీటీలోకి వచ్చిన తమిళ రొమాంటిక్ ఆంథాలజీ
Advertisement

Tamil Romantic Movie: ‘వోవెల్స్’ గురించి చదువుకున్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఎల్కేజీలోనే మనందరం వీటి గురించి నేర్చుకున్నాము. ఆంగ్ల అక్షరాలు A, E, I, O, Uలనే వోవెల్స్ అంటారు. అసలు ఇప్పుడేందుకు వీటి గోల అనుకుంటున్నారా ? ఎందుకంటే ఇప్పుడు మన మూవీ సజెషన్ లో వచ్చే మూవీ కూడా వీటిని బేస్ చేసుకుని తెరకెక్కించిందే. అదే ‘వోవెల్స్: యాన్ అట్లాస్ ఆఫ్ లవ్’ (Vowels An Atlas of Love). మరి ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో మొత్తం 5 కథలు ఉంటాయి. మొదటి కథ A – Attraction. ఇందులో యువత మధ్య మొదలయ్యే శారీరక, మానసిక ఆకర్షణ, అది దారితీసే సంఘర్షణలను చూపిస్తారు.

Advertisement

రెండవ కథ E – Emotionలో కేవలం ఆకర్షణ కాకుండా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే లోతైన భావోద్వేగ బంధాన్ని, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయాణాన్ని అందంగా చిత్రీకరించారు.

మూడవ కథ I – Intimacyలో ప్రేమలో సాన్నిహిత్యం ఎంత ముఖ్యమో, శారీరక, మానసిక సాన్నిహిత్యం సంబంధాన్ని ఎలా బలపరుస్తుందో చూపిస్తారు.

Advertisement

నాలుగవ కథ O – Obsession కొంత డార్క్ టోన్‌తో సాగుతుంది. ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ప్రేమ వ్యామోహంగా మారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ కథలో ట్విస్టులతో చూపించారు.

చివరి కథ U – Unconditional Loveలో నిబంధనలు లేని, స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమను హార్ట్ టచింగ్ గా చూపించి సిరీస్‌ని ముగించారు.

తెలుగులో లేదు

ప్రేమ అంటే ఒక్క మాటలో చెప్పలేని భావం. ఆకర్షణ, భావోద్వేగం, సాన్నిహిత్యం, వ్యామోహం, రూల్స్ లేని స్వచ్ఛమైన ప్రేమ… ఇలా అనేక రూపాలు దాల్చుతుంది. ఈ విభిన్న కోణాలను అందంగా చూపించిన తమిళ ఆంథాలజీ చిత్రం ఇది. ఆంగ్ల అక్షరాలు A, E, I, O, U ఆధారంగా ఐదు వేర్వేరు కథలతో, ఐదుగురు దర్శకులు తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 13న థియేటర్లలో విడుదలైంది. ప్రతి అక్షరం ఒక భావోద్వేగాన్ని సూచిస్తుంది.

ఈ అయిదు కథలు వేర్వేరు దర్శకులు తెరకెక్కించడం వల్ల ప్రతి ఒక్కటి డిఫరెంట్ స్టైల్‌తో ఉంటుంది. యుగి సేతు, చిన్ని జయంత్, రాజ్ అయ్యప్ప, సంయుక్త విశ్వనాథన్ వంటి నటీనటులు వివిధ కథల్లో విభిన్న పాత్రల్లో నటించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా మొత్తం వివిధ ప్రేమ రంగులను ఒక అట్లాస్ లాగా చూపించడం ప్రత్యేకత. అయితే కొన్ని కథల మధ్య పొంతన లేకపోవడం, కొన్ని సెగ్మెంట్లు బలహీనంగా ఉండటం వల్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం కేవలం తమిళ భాషలోనే థియేటర్లలో విడుదలైంది. డిజిటల్ రిలీజ్, డబ్బింగ్ హక్కులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా ఓటీటీలో అందుబాటులో లేదు, కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా ఇంకా విడుదల కాలేదు.

Read Also: సూర్యరశ్మి పడితే వీళ్ళకి చావే… శృతి హాసన్ ఫేవరెట్ హర్రర్ మూవీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×