// // Ustaad Bhagath Singh OTT : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ పార్ట్నర్ లాక్.. -->
E-Paper
Advertisement

Ustaad Bhagath Singh OTT : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందంటే..?

Ustaad Bhagath Singh OTT : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందంటే..?
Advertisement

Ustaad Bhagath Singh OTT : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా జోడిగా నటించారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ రెండో మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఉగాది సందర్బంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఇవాళ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. ప్రస్తుతం మౌత్ టాక్ మాత్రం బాగానే ఉంది.. మరి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఓటీటీ పార్ట్నర్ ఏది? ఎప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఓటీటీ లాక్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా థియేటర్లలో పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా.. ఓటీటీలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. మరి ఇప్పుడు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది సందర్బంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏప్రిల్ చివరి వారం లేదా మే ఫస్ట్ వీక్లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.. త్వరలోనే ఓటీటీ డేట్ ను మేకర్స్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

Advertisement

Also Read : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ బ్లాక్ బాస్టర్..!

పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి శంకర్ కాంబినేషన్ వచ్చినా గబ్బర్ సింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. పవన్ కళ్యాణ్ లైఫ్ లో బిగ్గెస్ట్ హిట్టుగా ఆ మూవీ నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఉస్తాద్భగత్ సింగ్ మూవీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది.. ఇవాళ థియేటర్లోకి వచ్చినా ఏ మూవీ ప్రస్తుతం అయితే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. పోలీస్ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు అని జనాలనుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక శ్రీ లీలా ఎప్పటిలాగే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో తమన్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది అని నెటిజెన్లు ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ అవుతున్నారు.. మొత్తానికి అయితే ట్విట్టర్రివ్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. మరి కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×