E-Paper
Advertisement

Crime Thriller OTT: 36 ఎపిసోడ్లు ఆరు సీజన్లతో దుమ్ములేపిన సిరీస్… బ్లేడ్ బ్యాచ్ నుంచి గ్యాంగ్స్టర్ దాకా

Crime Thriller OTT: 36 ఎపిసోడ్లు ఆరు సీజన్లతో దుమ్ములేపిన సిరీస్…  బ్లేడ్ బ్యాచ్ నుంచి గ్యాంగ్స్టర్ దాకా
Advertisement

Crime Thriller OTT : ఒక మంచి క్రైమ్ డ్రామాని చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ పై ఓ లుక్ వేయండి. ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బిర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్) నేపథ్యంలో సాగుతుంది. ఒక క్రైమ్ ఫ్యామిలీ, వాళ్ళ గ్యాంగ్ ‘పీకీ బ్లైండర్స్’ చేసే అరాచకాలు, రాజకీయ ఎత్తుగడల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సిరీస్ కేవలం ఊహ కాదు. 1890లలో ఇంగ్లాండ్‌లోని బిర్మింగ్‌హామ్‌లో ‘పీకీ బ్లైండర్స్’ అనే నిజమైన గ్యాంగ్ ఉండేది. అయితే సిరీస్ లో చూపించినంత స్టైలిష్‌గా కాకుండా, వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు మాత్రమే చేసేవాళ్ళు. ఈ సిరీస్ కు ఐయండిబిలో 8.7 రేటింగ్ ఉందంటేనే ఇందులో మ్యాటర్ ఎలా ఉంటుందో తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ బ్రిటిష్ క్రైమ్ డ్రామా సిరీస్ పేరు ‘పీకీ బ్లైండర్స్’ (Peaky Blinders). ఇది 2013 సెప్టెంబర్ 12న మొదలై, మొత్తం 6 సీజన్లతో 2022లో ముగిసింది. సిలియన్ మర్ఫీ ఇందులో థామస్ షెల్బీ గా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక ఈ సిరీస్ లు అన్ని నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత, దీని కొనసాగింపుగా “పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్” (Peaky Blinders: The Immortal Man) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా కూడా 2026 మార్చి 20న నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలవుతోంది. ఇది ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా కథ రెండవ ప్రపంచ యుద్ధం (1940) సమయంలో జరుగుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇది ఇంగ్లాండ్‌లోని బిర్మింగ్‌హామ్ అనే ఊరిలో, ఒక వంద ఏళ్ల కిందట జరిగిన కథ. అక్కడ ‘షెల్బీ’ అనే ఒక రౌడీ ఫ్యామిలీ ఉండేది. వీళ్ల గ్యాంగ్ పేరే ‘పీకీ బ్లైండర్స్’. వీళ్లు మామూలోళ్లు కాదు, తలపాగా (క్యాప్) అంచుల్లో బ్లేడ్లు దాచిపెట్టి, ఎవడైనా ఎదురొస్తే కళ్లు పోగొట్టే రకాలు. ఈ గ్యాంగ్‌కి మెయిన్ లీడర్ థామస్ షెల్బీ. యుద్ధానికి వెళ్లి వచ్చిన ఈయనకి బుర్ర మామూలుగా పనిచేయదు. గుర్రపు పందాలు, సారా వ్యాపారం చేస్తూ మెల్లగా ఊరినంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. పోలీసులతో, వేరే గ్యాంగులతో తలపడుతూ తన ఫ్యామిలీని పెద్ద స్థాయికి తీసుకెళ్లడమే ఇతని పని.

కానీ కథ అక్కడితో ఆగదు. థామస్ షెల్బీకి ఎంత పవర్ పెరిగినా, శత్రువులు కూడా అంతే పెరుగుతారు. ఇటాలియన్ మాఫియా, రష్యన్ గ్యాంగులు, ఇంకా గవర్నమెంట్ మనుషులు కూడా వీళ్లని ఖతం చేయాలని చూస్తుంటారు. ఇంట్లో వాళ్ల మధ్య గొడవలు, బయట చావో రేవో తేల్చుకోవాల్సిన ఫైట్లు.. ఇలా ఊపిరి బిగబట్టేలా ఉంటుంది. ఎంత మంది చనిపోయినా, ఎంత మంది ద్రోహం చేసినా థామస్ మాత్రం తన తెలివితేటలతో అందరినీ ముప్పుతిప్పలు పెడతాడు. చివరికి చిన్న గ్యాంగ్ స్థాయి నుండి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఈ షెల్బీ ఫ్యామిలీ ఎలా ఎదిగిందన్నదే ఈ కథ.

Advertisement

Read Also : ప్రేమ కోసం బోలెడన్ని మర్డర్లు…రక్తపాతంతో సాగే సైకో రాసలీల… ఒక్కో సీన్ అరాచకం…

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×