E-Paper
Advertisement

Upcoming Web Series OTT : బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ హిట్ సిరీస్‌ ఓటీటీలోకి… ఎక్కడ చూడవచ్చు అంటే ?

Upcoming Web Series OTT : బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ హిట్ సిరీస్‌ ఓటీటీలోకి… ఎక్కడ చూడవచ్చు అంటే ?
Advertisement

Upcoming Web Series OTT : బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ ‘అబార్ ప్రోలోయ్’ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. 2023 లో వచ్చిన మొదటి సీజన్ హిట్ అవ్వడంతో ఈ సీజన్ ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. సుందర్బన్స్‌లో మానవ అక్రమ రవాణాను ఉత్కంఠభరితంగా చూపించారు మొదటి సీజన్ లో. అయితే ఇప్పుడు వస్తున్న ఈ సీజన్ కలకత్తా నేపథ్యంలో సాగనుంది. ముఖ్యంగా అనిమేష్ దత్తాగా శాశ్వత ఛటర్జీ నటన ఈ సిరీస్ కి హైలెట్ గా నిలుస్తోంది. ఇప్పుడు సీజన్ 2 ఎప్పుడు వచ్చేది ఒక ప్రకటన కూడా చేశారు మేకర్స్. దీన్ని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘అబార్ ప్రోలోయ్ సీజన్ 2’ (Abar Proloy Season 2) సిరీస్‌కు రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2026 ఫిబ్రవరి 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సూపర్‌కాప్ అనిమేష్ దత్తా’గా, శాశ్వత ఛటర్జీ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. రిత్విక్ చక్రవర్తి, మోనిగా కౌషాని ముఖర్జీ, పరణ్ బందోపాధ్యాయ, సోహినీ సేన్‌గుప్తా, సయోని ఘోష్, జూన్ మాలియా, దేబాసిష్ మొండల్ వంటి నటులు కూడా ఇందులో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి సీజన్లో ఒక టీనేజ్ అబ్బాయిల ముఠా, యువతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ రాకెట్‌ను ఛేదించడానికి స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అనిమేష్ దత్తాను సుందర్‌బన్స్ కు పంపిస్తారు అధికారులు. అక్కడ అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముందు, నకిలీ ప్రేమ ఉచ్చులలోకి లాగడానికి యువకులు వల వేస్తుంటారు. వాళ్ళ నుంచి యువతులను అనిమేష్ దత్తా కాపాడటంతో కథ ముగుస్తుంది.

ఇక రెండో సీజన్‌లో కథ సుందర్‌బన్స్ అడవుల నుంచి కోల్‌కతా సిటీకి షిఫ్ట్ అవుతుంది. సిటీలో వరుసగా జరుగుతున్న భారీ గోల్డ్ రాబరీల వల్ల పోలీసులు తలపట్టుకుంటారు. ఈ కేసును డీల్ చేయడానికి మన స్పెషల్ ఆఫీసర్ అనిమేష్ దత్తా (శాశ్వత ఛటర్జీ) ఎంట్రీ ఇస్తారు. నేరస్థులు చాలా తెలివిగా ప్లాన్ చేసి దొరక్కుండా తిరుగుతుంటే, అనిమేష్ తన స్టైల్‌లో వాళ్ళ అడ్రస్ కనుక్కోవడానికి రెడీ అవుతాడు. కోల్‌కతా సందుల్లో దొంగల కోసం ఆయన చేసే వేట చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తన టీమ్‌తో కలిసి ఈ పెద్ద నెట్‌వర్క్‌ను ఆయన ఎలా బ్రేక్ చేశాడనేదే ఈ సీజన్ మెయిన్ కథ. ఫస్ట్ సీజన్ కంటే ఇందులో యాక్షన్, థ్రిల్ ఇంకా గట్టిగా ఉండబోతున్నాయి.

Advertisement

Read Also : మొగుడు మిస్సింగ్ తో భార్య చేసే సాహసం… అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు…క్లైమాక్స్ కేక

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×