E-Paper
Advertisement

Upcoming OTT Movies : ‘దురంధర్’ నుంచి ‘సర్వం మాయ’ వరకు… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఏకంగా 9 సినిమాలు సిరీసులు

Upcoming OTT Movies : ‘దురంధర్’ నుంచి ‘సర్వం మాయ’ వరకు… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఏకంగా 9 సినిమాలు సిరీసులు
Advertisement

Upcoming OTT Movies : ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏదో ఒక కొత్త సినిమా వస్తూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం శుక్రవారం అంటే జనవరి 30 చాలా ప్రత్యేకం కాబోతోంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఎదురుచూస్తున్న సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఆ లిస్ట్ లో రణవీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దురంధర్’ కూడా ఉండడం విశేషం. అంటే ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ డబుల్ కాబోతోంది. మరి జనవరి 30న విడుదల కాబోతున్న ఆ మోస్ట్ అవైటింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

దురంధర్ (Dhurandhar)

ఈ హై-ఆక్టెన్ స్పై థ్రిల్లర్ పాకిస్తాన్‌ లోని కరాచీలో ISI-అండర్ వరల్డ్ లోకి చొరబడటానికి భారత నిఘా విభాగం ఎంచుకున్న జస్కిరత్ సింగ్ రంగి (రణ్‌వీర్ సింగ్) కథ. హంజా అలీ మజారి అనే మారుపేరుతో పని చేస్తున్న జస్కిరత్ లైయారిలో రెహ్మాన్ డాకు (అక్షయే ఖన్నా) ముఠాలో చేరతాడు. ఆ తరువాత ఏమైంది అన్నది స్టోరీ. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ తారాగణం ఉన్నారు. ‘దురంధర్’ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది.

సర్వం మాయ (Sarvam Maya)

Advertisement

మలయాళ సూపర్ నేచురల్ కామెడీ చిత్రం ‘సర్వం మాయ’. నివిన్ పౌలీ ఇందులో హీరోగా నటించాడు. అతను ఒక నాస్తికుడు. కుటుంబ వృత్తిగా వస్తున్న పూజారి హోదాను అయిష్టంగానే చేపట్టే వ్యక్తి. ఒకసారి పూజ చేస్తున్న సమయంలో గత మరిచిపోయిన దెయ్యం ఎంట్రీ ఇస్తుంది. నెమ్మదిగా ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. జనవరి 30 నుండి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమాను చూడవచ్చు.

మిరాకిల్: ది బాయ్స్ ఆఫ్ ’80’ (Miracle: The Boys of ’80)

1980 వింటర్ ఒలింపిక్స్‌ లో పురుషుల ఐస్ హాకీ టోర్నమెంట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సోవియట్ యూనియన్‌ పై US జట్టు సెమీ ఫైనల్ విజయం, ఆ తర్వాత బంగారు పతకం సాధించడం వంటి అంశాలను ఇందులో చూడవచ్చు. ఇది జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది.

ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు (If I Had Legs I’d Kick You)

Advertisement

అక్టోబర్ 2025లో థియేటర్లలో విడుదలైన ‘ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు’ జనవరి 30న HBO Maxలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. రోజ్ బైనర్ నటించిన ఈ మూవీ Apple TV, Amazon, Fandango at Home, Roku వంటి ఓటీటీలలో రెంట్ కు కూడా అందుబాటులో ఉంది.

పోతుగడ్డ (Pothugadda)

రక్షణ వీరన్ దర్శకత్వం వహించిన తెలుగు థ్రిల్లర్ ‘పోతుగడ్డ’. అనేక వాయిదాల తర్వాత జనవరి 30న ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుంది. మొదట నవంబర్ 2024లో విడుదల కావాల్సి ఉండగా, పొంగల్ పండుగకు అనుగుణంగా ఈ సినిమా ప్రీమియర్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత డిజిటల్ అరంగేట్రం ఫిక్స్ చేశారు. వీటితో పాటు ‘హైజాక్ సీజన్ 1’ ఎపిసోడ్ 3 జనవరి 30న ఆపిల్ టీవీలో విడుదలవుతోంది, ‘ప్రిపరేషన్ ఫర్ ది నెక్స్ట్ లైఫ్’ ప్రైమ్ వీడియోలో, ‘సెండ్ హెల్ప్’, ‘ది మూమెంట్’ కూడా విడుదలవుతున్నాయి.

Read Also : Roslin OTT Release : మీనా థ్రిల్లర్ సిరీస్ పై హాట్ స్టార్ అఫిషియల్ అనౌన్స్మెంట్… లైన్లో ఇంకా 4 వెయిటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×