E-Paper
Advertisement

మిస్టీరియస్ డెత్స్… రోడ్డుపైకి రాగానే మృత్యు ఒడిలోకి… సీట్ ఎడ్జ్ సస్పెన్స్

మిస్టీరియస్ డెత్స్… రోడ్డుపైకి రాగానే మృత్యు ఒడిలోకి… సీట్ ఎడ్జ్ సస్పెన్స్
Advertisement

Thriller Movie : కొన్ని సినిమాలను ఒక్కసారి చూస్తే ఎంతకాలమైనా మర్చిపోలేము. అలాంటి చెరగని ముద్ర వేసే కథలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ‘యూ-టర్న్’ (U-Turn) అనే మూవీ కూడా ఉంటుంది. ఈ కన్నడ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించారు. మరి ఈ సూపర్ హిట్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక లీడింగ్ న్యూస్ పేపర్‌ లో ఇంటర్న్‌ గా పని చేసే జర్నలిస్ట్ రచన (సమంత). హైదరాబాద్‌లోని ఒక బిజీ ఫ్లైఓవర్ పై డివైడర్లని జరిపి, అక్రమంగా ‘యూ-టర్న్’ తీసుకునే వారిపై ఒక ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ రాయాలని ఆమె నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఒక ట్రాఫిక్ పోలీస్ సహాయంతో, ఆ ఫ్లైఓవర్ పై అక్రమంగా యూ-టర్న్ తీసుకున్న వాహనాల నంబర్లను, వాటి యజమానుల అడ్రస్‌ లను సేకరిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ లిస్ట్‌లో ఉన్న మొదటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి రచన అతని ఇంటికి వెళ్తుంది. కానీ అతను ఇంట్లో ఉండడు. ఆ రోజే రాత్రి పోలీసులు రచనను అరెస్ట్ చేస్తారు. కారణం… ఆమె కలవడానికి వెళ్లిన వ్యక్తి అదే రోజు రాత్రి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు.

Advertisement

ఆ మరణంతో రచనకు సంబంధం ఉందనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ నాయక్ (ఆది పినిశెట్టి) ఆమెను విచారిస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రచన తన వద్ద ఉన్న లిస్ట్‌ను నాయక్‌కు చూపిస్తుంది. దీంతో ఆ లిస్ట్‌లో ఉన్న మిగతా వ్యక్తులని వెతుక్కుంటూ వెళ్లగా, ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ ఫ్లైఓవర్ పై యూ-టర్న్ తీసుకున్న ప్రతి ఒక్కరూ అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుని చావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

అంతుచిక్కని ఈ మిస్టరీ వెనుక ఏదో ఒక అదృశ్య శక్తి దాగి ఉందనే కోణంలో ఇన్వెస్టిగేషన్ టర్న్ తీసుకుంటుంది. మరి ఇంతకీ ప్రమాదలకు కారణం ఎవరు ? ఆ అదృశ్య శక్తి ఎవరు ? చివరకు రచన తన తెలివితేటలతో, నాయక్ సహాయంతో ఆ ఆత్మకు ఎలా శాంతి చేకూర్చింది ? ఆ ఫ్లైఓవర్ పై ప్రమాదాలకు ఎలా ముగింపు పలికింది ? అనేదే ఈ సినిమా కథ.

ఎక్కడ చూడవచ్చు ?

Advertisement

ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Netflix లలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా, నరేంద్ర ప్రసాద్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈయనే కన్నడ ఒరిజినల్ వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేశారు.

Read Also : జైలులోనే అతి కిరాతకంగా హత్య… సైకో కిల్లర్ కు చెక్ పెట్టే లేడీ కిలాడీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×