E-Paper
Advertisement

ట్విన్ సిస్టర్ చావు వెనకున్న సీక్రెట్… సైకోకు చుక్కలు చూపించే చూపులేని అమ్మాయి

ట్విన్ సిస్టర్ చావు వెనకున్న సీక్రెట్… సైకోకు చుక్కలు చూపించే చూపులేని అమ్మాయి
Advertisement

Psychological Thriller : హిందీ సినిమాల్లో సైకలాజికల్ థ్రిల్లర్లు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన చిత్రం ‘బ్లర్’ ఈరోజు మన మూవీ సజెషన్. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా స్పానిష్ చిత్రం ‘జూలియాస్ ఐస్’ అధికారిక రీమేక్. కంటిచూపు కోల్పోయే భయం ఓ వైపు, సైకో కిల్లర్ మరోవైపు… ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లతో నిండిన ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

గాయత్రి – గౌతమి అనే కవల అక్కాచెల్లెళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇద్దరూ ఒకే విధమైన కంటి వ్యాధితో బాధపడుతుంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైతే వారి కంటిచూపు పూర్తిగా పోతుంది. ఒకరోజు గౌతమి తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోతుంది. పోలీసులు దీనిని ఆమె కంటిచూపు పోవడం వల్ల వచ్చిన డిప్రెషన్‌తో జరిగిన ఆత్మహత్యగా భావిస్తారు. కానీ గౌతమి అంత సులభంగా ఆత్మహత్య చేసుకోదని గాయత్రి గట్టిగా నమ్ముతుంది. తన సోదరి మరణం వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి గాయత్రి తన భర్త నీల్ (గుల్షన్ దేవయ్య) సహాయంతో దర్యాప్తు మొదలు పెడుతుంది.

Advertisement

దర్యాప్తు సాగుతుండగా గౌతమికి ఒక సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని తెలుస్తుంది. ఆ వ్యక్తిని ఎవరూ సరిగ్గా చూడలేదు. ఈ క్రమంలో గాయత్రి మీద కూడా మానసిక ఒత్తిడి పెరిగి ఆమె కంటిచూపు కూడా పోతుంది. అదే సమయంలో ఆమె భర్త నీల్ కూడా అదృశ్యమవుతాడు. కంటి చూపు పోయిన గాయత్రికి సహాయం చేయడానికి ‘దీపక్’ అనే కేర్‌టేకర్ వస్తాడు. ఆమె అతన్ని పూర్తిగా నమ్ముతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురవుతుంది.

దీపక్ అసలు గౌతమి మరణానికి కారణమైన సైకో కిల్లర్. సమాజంలో ఎవరికీ గుర్తింపు లేని, అందరూ నిర్లక్ష్యం చేసే ‘అదృశ్య’ వ్యక్తిగా బతికే అతనికి చూపు లేని అమ్మాయిలు మాత్రమే తనను స్పర్శతో గుర్తిస్తారని, తనను ప్రేమిస్తారని విచిత్రమైన మానసిక స్థితి ఉంటుంది. చివరకు గాయత్రికి కంటి ఆపరేషన్ జరిగి చూపు పాక్షికంగా తిరిగి వస్తుంది. అప్పుడు దీపక్ అసలు స్వరూపం ఆమెకు తెలుస్తుంది. కళ్ళు పూర్తిగా కనిపించని స్థితిలోనే ఆ సైకో కిల్లర్ నుంచి తన ప్రాణాలను ఆమె ఎలా కాపాడుకుంది ? అతనికి ఎలా బుద్ధి చెప్పింది ? అనే మూవీ కథ. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి.

స్ట్రాంగ్ టెక్నికల్ టీం

Advertisement

తాప్సీ పన్ను ఈ సినిమాలో డబుల్ రోల్ లో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా బ్లైండ్ ఉమెన్‌గా ఆమె పడే భయం, తపన, ధైర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. గుల్షన్ దేవయ్య గాయత్రి భర్త నీల్ పాత్రలో, అభిలాష్ థప్లియాల్ దీపక్ సైకో కిల్లర్ పాత్రలో బాగా నటించారు. సాధారణ వ్యక్తి నుంచి క్రూరమైన కిల్లర్‌గా మారే అతని ట్రాన్స్‌ఫార్మేషన్ గుర్తుండిపోతుంది. కృతికా దేశాయ్ జఖార్ సైకో కిల్లర్ తల్లి పాత్రలో కన్పిస్తుంది. అజయ్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతంలో ఆయన తీసిన ‘బిఏ పాస్’, ‘సెక్షన్ 375’ వంటి చిత్రాల స్టైల్‌లోనే ఉంటుంది. జీ స్టూడియోస్ తో కలిసి తాప్సీ పన్ను ఈ సినిమాను నిర్మించారు.

Read Also : ఊరినే వల్లకాడుగా మార్చే ఒకే ఒక్క పొరపాటు… సింగిల్ గా చూశారో ఫసక్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×