E-Paper
Advertisement

టాప్ 5 దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… ఓటీటీ తగలడిపోవాల్సిందే భయ్యా

టాప్ 5 దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… ఓటీటీ తగలడిపోవాల్సిందే భయ్యా
Advertisement

Action Thriller Films on OTT : సినిమా హాల్‌లో లైట్లు ఆఫ్ అయ్యాక, బిగ్ స్క్రీన్ మీద బూమ్ బూమ్ సౌండ్ వచ్చి బాడీలో అడ్రినలిన్ పెరిగితే.. ఆ ఫీల్ వేరే సార్! ఇలాంటి హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు థియేటర్‌లో చూస్తే ఒళ్ళంతా పూర్తిగా షేక్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆ కిక్కును ఫీల్ అవ్వాలనుకుంటే… ఈ 5 సూపర్ ఎపిక్ హాలీవుడ్ యాక్షన్ మూవీలు మీకు పర్ఫెక్ట్.

1. టెర్మినేటర్ 2: జడ్జ్‌మెంట్ డే (Terminator 2: Judgment Day 1991)

యాక్షన్ సినిమాలకు కొత్త డెఫినిషన్ ఇచ్చిన సినిమా ఇది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ రోబోగా వచ్చి చేసిన యాక్షన్ సీన్లు, లిక్విడ్ మెటల్ విలన్‌ తో జరిగిన ఫైట్లు, ఇప్పటికీ అత్యుత్తమ యాక్షన్ మూవీల్లో ఒకటిగా నిలిచిపోయింది.ఈ మూవీ Lionsgate Play, Jio Hotstarలో అందుబాటులో ఉంది.

2. ప్రిడేటర్ (Predator – 1987)

Advertisement

దట్టమైన అడవిలో కంటికి కనిపించని గ్రహాంతర వేటగాడు.. ఆర్నాల్డ్ నేతృత్వంలోని ఆర్మీ టీమ్‌తో జరిగే భయంకర హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా ఇచ్చే థ్రిల్, టెన్షన్ చూస్తే గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. క్లైమాక్స్ వరకు కళ్లు తిప్పుకోనివ్వదు ఈ మూవీ. ఇది జియో హాట్ స్టార్ లో ఉంది.

3. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ (Mad Max Fury Road 2015)

ఈ సినిమా మొదలైన మొదటి నిమిషం నుంచి ఎండ్ టైటిల్స్ వరకు నాన్-స్టాప్ యాక్షన్. కారు ఛేజింగ్‌ లు, బ్లాస్టింగ్‌ లు, స్టంట్స్.. రియల్ స్టంట్స్‌తో థియేటర్‌ ను దుమ్ములేపేసింది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ మూవీ. జియో హాట్ స్టార్ తో Apple TVలో అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read : డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

4. మిషన్ ఇంపాజిబుల్ – ఫాల్అవుట్ (Mission: Impossible – Fallout 2018)

టామ్ క్రూజ్ అంటే ప్రాణాలు పణంగా పెట్టి స్టంట్స్ చేసే హీరో అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హెలికాప్టర్ ఫైట్, బిల్డింగ్ పై నుంచి దూకడం, బైక్ ఛేజ్… ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. Netflix, Amazon Prime Videoలో ఉంది.

5. టాప్ గన్: మావెరిక్ (Top Gun: Maverick 2022)

30 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినా థియేటర్లను షేక్ చేసింది. రియల్ ఫైటర్ జెట్లలో షూట్ చేసిన స్కై యాక్షన్ సీన్లు, థియేటర్‌లో కూర్చుని ఆకాశంలో విహరించినట్టు అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలు ఏదైనా ఒక్కటి చూస్తే చాలు… ఇంట్లోనే ఫుల్ యాక్షన్ మూడ్‌లోకి వెళ్తారు.

Also Read : 2026 హారర్ హిట్ ‘ది మమ్మీ’ ఓటీటీలోకి… ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×