// // Best Sports Movies on OTT : హాట్ స్టార్ లో ఉన్న ఈ బెస్ట్ స్పోర్ట్స్ బయోపిక్ లు -->
E-Paper
Advertisement

స్పోర్ట్స్ అంటే చెవికోసుకుంటారా ? హాట్ స్టార్ లో ఉన్న ఈ బెస్ట్ స్పోర్ట్స్ బయోపిక్ లు మీకోసమే

స్పోర్ట్స్ అంటే చెవికోసుకుంటారా ? హాట్ స్టార్ లో ఉన్న ఈ బెస్ట్ స్పోర్ట్స్ బయోపిక్ లు మీకోసమే
Advertisement

Best Sports Movies on OTT : మీకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, నిజ జీవితంలో హీరోలుగా నిలిచిన వారి కథలు చూడటం ఇష్టమా ? అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar) లో అందుబాటులో ఉన్న ఈ మూడు అద్భుతమైన బయోపిక్‌లను అస్సలు మిస్ అవ్వకండి. బాలీవుడ్ అయినా, సౌత్ సినిమా అయినా… సమాజంలో తమ కృషితో చరిత్ర సృష్టించిన వారి ప్రయాణాన్ని తెరపై చూపిస్తే ఆ కిక్కే వేరు. వినోదంతో పాటు ఎంతగానో ఇన్‌స్పైర్ చేసే ఈ మూడు సినిమాలు IMDb లో 8 కంటే ఎక్కువ రేటింగ్ సాధించి ప్రేక్షకులను మెప్పించాయి. మరి ఆ సినిమాలు ఏంటంటే ?

1. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (MS Dhoni: The Untold Story)

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఒక చిన్న పట్టణంలో రైల్వే టికెట్ కలెక్టర్‌ గా పని చేస్తూ.. దేశం గర్వించే క్రికెటర్‌ గా అతను ఎలా ఎదిగాడు ? అనేది ఇందులో అద్భుతంగా చూపించారు. ధోని పాత్రలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒదిగిపోయారు. అతని కెరీర్ లోని ఒడిదొడుకులు, ప్రేమకథ, వరల్డ్ కప్ విజయాల ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. దీనికి ఐయండీబీలో 8.0 రేటింగ్ ఉంది.

2. పాన్ సింగ్ తోమర్ (Paan Singh Tomar)

Advertisement

ఇది ఒక జాతీయ స్థాయి అథ్లెట్ జీవితంలో జరిగిన ఊహించని మలుపుల కథ. దేశం తరఫున పతకాలు గెలిచిన ఆర్మీ జవాన్, స్టీపుల్‌చేజ్ ఛాంపియన్ అయిన పాన్ సింగ్ తోమర్, పరిస్థితుల ప్రభావం వల్ల చంబల్ లోయ బందిపోటుగా మారాల్సి వస్తుంది. ఒక క్రీడాకారుడు తిరుగుబాటుదారుడిగా మారడానికి దారి తీసిన సమాజ అవినీతి, కుటుంబ తగాదాలను దర్శకుడు చక్కగా చూపించారు. ఇర్ఫాన్ ఖాన్ తన అద్భుత నటనతో ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. దీనికి 8.3 రేటింగ్ ఉంది.

Also Read : ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు

3. కౌన్ ప్రవీణ్ తాంబే? (Kaun Pravin Tambe)

Advertisement

వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని నిరూపించిన క్రికెటర్ ప్రవీణ్ తాంబే కథ ఇది. చాలా మంది ఆటగాళ్లు 40 ఏళ్లకు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే, ప్రవీణ్ తాంబే 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ (IPL) ద్వారా తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌ ను ప్రారంభించి చరిత్ర సృష్టించాడు. సాధారణ మధ్యతరగతి వ్యక్తి తన కల కోసం పడిన తపనను నటుడు శ్రేయాస్ తల్పాడే తెరపై అద్భుతంగా పండించారు. ఐఎండీబీలో దీనికున్న రేటింగ్ 8.3. ఈ మూడు సినిమాలు కేవలం కాలక్షేపానికే కాకుండా, జీవితంలో అనుకున్నది సాధించాలనే పట్టుదలను పెంచుతాయి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×