E-Paper
Advertisement

2 గంటల 41 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… ఫహద్ ఫాజిల్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరు

2 గంటల 41 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… ఫహద్ ఫాజిల్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరు
Advertisement

Crime Thriller OTT : ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్, అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం వెతుకుతున్నారా ? అయితే మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ నటించిన ‘మాలిక్’ (Malik) సినిమా మీకు పర్‌ఫెక్ట్ ఛాయిస్. ‘పుష్ప’, ‘విక్రమ్’, ‘ఆవేశం’ చిత్రాల్లో తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారారు ఫహద్. ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, కథను తన భుజాలపై వేసుకుని నడిపించడంలో దిట్ట. ఆయన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నప్పటికీ, చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన సినిమానే ఈ ‘మాలిక్’.

కథేంటంటే ?

ఇది 2021లో విడుదలైన ఒక పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామా. కథ మొత్తం ‘ఫ్రెడ్డీ’ అనే ఒక ఖైదీ చుట్టూ తిరుగుతుంది. అతను జైలులో ఉన్నప్పుడు, ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ అయిన తన సొంత మామ ‘సులేమాన్ అలియాస్ ఆలీ ఇక్కా’ (ఫహద్ ఫాసిల్)ను చంపే కాంట్రాక్ట్ అతనికి వస్తుంది. ఈ క్రమంలోనే సులేమాన్ గతం ఏంటి ? ఒక సామాన్య యువకుడు తన గ్రామంలోని రాజకీయ నాయకులు, పోలీసుల అవినీతిపై ఎలా తిరగబడ్డాడు ? తీర ప్రాంత ప్రజల కోసం అతను చేసిన పోరాటం ఏంటి ? అనే విషయాలు ఫ్రెడ్డీకి తెలుస్తాయి. నేరాలు, రాజకీయ కుతంత్రాలు, భావోద్వేగాల కలయికతో ఈ సినిమా సాగుతుంది.

Advertisement

Also Read : ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌పుత్ – శరవణన్ స్పై యాక్షన్ థ్రిల్లర్… ఐయండిబిలో 7.1 రేటింగ్

సినిమా ప్రత్యేకతలు

2 గంటల 41 నిమిషాల నిడివి గల ఈ సినిమా ప్రేక్షకుడికి అస్సలు బోర్ కొట్టించదు. ఇందులో మహేష్ నారాయణన్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వండర్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఫహద్‌తో పాటు నిమిషా సజయన్, వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్ తమ నటనతో ప్రాణం పోశారు. ఐఎమ్‌డిబిలో ఈ సినిమాకు 8 రేటింగ్ లభించింది. సినిమా మొదట్లోనే వచ్చే 14 నిమిషాల సింగిల్-షాట్ సీన్ ఈ చిత్రానికి హైలైట్. దీనికోసం ఏకంగా 7 రీటేక్స్ తీసుకున్నారు. సులేమాన్ పాత్రలోని గాంభీర్యాన్ని చూపించడానికి ఈ లాంగ్ షాట్ పెట్టామని దర్శకుడు చెప్పారు. ఈ ఒక్క షాట్ కోసమైనా ఈ మూవీని చూడాల్సిందే. అందులోనూ ఫహాద్ ఫాజిల్ అభిమానులు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది.

ఎక్కడ చూడాలి ?

Advertisement

ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆడియో అందుబాటులో ఉంది. వీకెండ్‌లో ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ అవ్వకండి.

Also Read : డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×