E-Paper
Advertisement

Thriller Movie OTT : ఒంటరి కొంపలో అమ్మాయి… హత్యలతో వణికిపోయే ఊరు… బోన్ చిల్లింగ్ థ్రిల్ పక్కా

Thriller Movie OTT : ఒంటరి కొంపలో అమ్మాయి… హత్యలతో వణికిపోయే ఊరు… బోన్ చిల్లింగ్ థ్రిల్ పక్కా
Advertisement

Thriller Movie OTT : ప్రపంచం మొత్తానికి సైకోలు చాలామంది ఉంటారు. వీళ్ళ అరాచకం ఒక్కోటి ఒక్కో స్టైల్ లో ఉంటది. కొందరు మనుషుల్ని హింసిస్తూ ఆనందపడుతుంటే, మరి కొంతమంది హత్యలు చేసి తృప్తి పడుతుంటారు. కొంతమంది ఎప్పుడు పక్క మనుషుల్ని ఇబ్బంది పెడుతూ తెగ సంబరపడిపోతుంటారు. ఇక ఈ నేపథ్యంలో మనం చెప్పుకోబోయే మూవీ ఒక సైకో కి కిల్లర్ గురించి. ఈ సినిమాలో ఒక ఒంటరి అమ్మాయి హత్యలు చేసే సైకోకి, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరుకుతుంది. ఇక సినిమా మొత్తం టెన్షన్ హై లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా మొత్తం కెనడాలోని కల్గారీ అనే ప్రాంతంలో తీశారు. అక్కడ చలి కాలంలో ఉండే ఆ వాతావరణం సినిమాలోని హారర్ సీన్లకి బాగా సెట్ అయింది.

ఎక్కడ చూడచ్చు అంటే

2025లో విడుదలైన ఈ హారర్ సినిమా పేరు ‘నైట్ ఆఫ్ ది రీపర్’ (Night of the Reaper). ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 19న Shudder ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. బ్రాండన్ క్రిస్టెన్సన్ దీనికి దర్శకత్వం వహించారు. మెయిన్ రోల్‌లో జెస్సికా క్లెమెంట్ (దీనాగా) అదరగొట్టింది. ఇక పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన ర్యాన్ రాబిన్స్ చాలా సీరియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ ని కూడా చాలా భయంకరంగా డిజైన్ చేశారు. దర్శకుడు ఈ సినిమాని మనకి 1980ల నాటి పాత సినిమాల్ని టీవీలో చూస్తున్న ఫీలింగ్ వచ్చేలా కలర్స్, కెమెరా యాంగిల్స్ అన్నీ ఆ కాలం నాటివే వాడారు. సినిమా మరీ సాగదీయకుండా సరిగ్గా 93 నిమిషాల్లో ముగించేశారు. అందుకే ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్‌గా సాగుతుంది ఈ సినిమా. దీనికి ఐఎండిబి (IMDb)లో 7/10 రేటింగ్ ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1980ల కాలంలో దీనా అనే ఒక కాలేజీ పిల్ల సెలవులకి ఇంటికి వస్తుంది. ఖాళీగా ఉండటం ఎందుకని పక్కింట్లో పిల్లల్ని చూసుకునే బేబీ సిట్టింగ్ పనికి కుదురుతుంది. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న టైంలో, ఎవడో ఒకడు ముఖానికి గొడ్డలి పట్టుకున్న ముసుగు వేసుకుని వస్తాడు. వాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఈ పిల్లను, ఆ ఇంట్లో ఉన్నవాళ్లని నానా రకాలుగా భయపెట్టడం మొదలుపెడతాడు. అసలు వాడు ఎవడు? ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అనేది మెయిన్ పాయింట్.

మరోపక్క ఊరి పోలీస్ ఆఫీసర్ కి ఒక వింతైన పార్శిల్ వస్తుంది. అందులో కొన్ని పాత ఫోటోలు, ఆధారాలు ఉంటాయి. వాడు ఒకదాని తర్వాత ఒకటి క్లూస్ ఇస్తూ షెరీఫ్‌ని ఊరంతా తిప్పిస్తాడు. ఈ గొడవంతా చూస్తుంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, పాత కాలం నాటి ఏదో పగ అని అర్థమవుతుంది. ఆ షెరీఫ్ ఆ క్లూస్‌ని పట్టుకుని హంతకుడి దగ్గరికి వెళ్లేలోపే అక్కడ సీన్ మొత్తం రక్తం ఏరులై పారుతుంటుంది. చివరి ముప్పై నిమిషాల్లో అసలు ఆట మొదలవుతుంది. ఆ ముసుగు వెనుక ఉన్నది ఎవరు ? ఆ నరరూప రాక్షసుడి నుండి దీనా తప్పించుకుందా ? ఆ సైకోని పోలీస్ పట్టుకున్నాడా ? అనే విషయాలను మాత్రం ఈ సినిమా చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  ప్రేమ జంటకు అదిరిపోయే షాక్ …ఒక్క రాత్రిలో ఇద్దరికి కడుపు… ఔరా అనిపించే విచిత్రం

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×