E-Paper
Advertisement

Sports Comedy OTT: తప్పి తిప్పలు పడే జపాన్ యోధుడు… కితకితలు పెట్టే కామెడీ కూడా

Sports Comedy OTT: తప్పి తిప్పలు పడే జపాన్ యోధుడు… కితకితలు పెట్టే కామెడీ కూడా
Advertisement

Sports Comedy OTT : సుమో అంటే మనకు తెలిసింది ఒక టాటా వెహికిల్ మాత్రమే. అయితే జపాన్లో సుమో అంటే మల్ల యోధులు. వాళ్లను చూస్తేనే మనకు గుండె జారిపోతుంది. వాళ్ళు చేసే మల్ల యుద్ధాలు జపాన్లో చాలా ఫేమస్. ఇక ఈ నేపథ్యంలో ఒక తమిళ స్పోర్ట్స్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే అనుకున్నంత రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రాలేదు. కానీ కామెడీ పరంగా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సుమో పాత్రలో నటించిన యోషినోరి తాషీరో నిజంగా జపాన్‌కు చెందిన మాజీ ప్రొఫెషనల్ సుమో రెజ్లర్. ఇండియాలో ఒక సుమో రెజ్లర్ మెయిన్ రోల్ చేసిన మొదటి సినిమా కూడా ఇదే. కామెడీ కోసం వీకెండ్ లో ఈ సినిమాను ఓ సారి ట్రై చెయ్యచ్చు.

స్టోరీ ఏమిటంటే

ఈ తమిళ స్పోర్ట్స్ కామెడీ సినిమా ‘సుమో’ (Sumo) S. P. హోసిమిన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో శివ, ప్రియా ఆనంద్, యోషినోరి తాషిరోలు VTV గణేష్, యోగి బాబు, సతీష్ వంటి నటులు నటించారు. నిజానికి ఈ సినిమా 2020లోనే రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల, కొన్ని ఆర్థిక కారణాల వల్ల దాదాపు 5 ఏళ్లు ఆగిపోయింది. చివరకు ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే, అంటే 2025 మే 23 నుండి Sun NXT, Tentkotta వంటి ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. మన సౌత్ ఇండియాలో టాప్ సినిమాటోగ్రాఫర్ అయిన రాజీవ్ మీనన్ ఈ సినిమాకు కెమెరా వర్క్ చేశారు. ఆయన విజువల్స్ వల్ల జపాన్ అందాలు, సుమో ఫైట్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి.

కథలోకి వెళ్తే

Advertisement

ఒక ఊరిలో శివ (హీరో) అనే ఒక కుర్రాడు, చెన్నై సముద్రపు ఒడ్డున కాలక్షేపం చేస్తుంటాడు. అయితే ఉన్నట్టుండి సముద్రపు అలల మీద కొట్టుకుంటూ ఒక భారీకాయుడు, అంటే ఒక జపనీస్ సుమో రెజ్లర్ ఒడ్డుకు చేరుతాడు. చూడ్డానికి కొండలా ఉన్నా, ఆ సుమోకి గతం మర్చిపోయి బుర్ర పని చేయదు. అచ్చం పసిపిల్లాడిలా ప్రవర్తిస్తుంటాడు. వాడికి తిండి పెట్టలేక, వాడు చేసే గోల భరించలేక శివ తల పట్టుకుంటాడు. అలాంటి టైంలో వీడికి ప్రియా (హీరోయిన్) పరిచయం అవుతుంది. ఈ లోపు ఆ సుమో ఎవరో కాదు, జపాన్‌లో పెద్ద ఛాంపియన్ అని వీళ్లకు అర్థమవుతుంది.

అయితే జపాన్ నుండి వచ్చిన కొందరు విలన్లు ఆ సుమోని చంపాలని ప్లాన్ చేస్తుంటారు. ఇంకేముంది, మన హీరో తన ఫ్రెండ్స్ యోగి బాబు, గణేష్‌లతో కలిసి ఆ సుమోని కాపాడి, వాడికి పాత విషయాలన్నీ గుర్తు చేసే బాధ్యత తీసుకుంటాడు. చివరికి మన హీరో ఆ సుమోని తీసుకుని జపాన్ వెళ్తాడు. అక్కడ అతనికి గతం గుర్తుకొస్తుందా ? ఆ సుమోను ఎవరు చంపాలని చూస్తున్నారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : దేశం కోసం ప్రాణాలకు తెగించే టీచర్ … యూత్ చూడాల్సిన పొలిటికల్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×