E-Paper
Advertisement

Thriller movie OTT: దీవిలో భార్యతో ఏకాంతంగా… సైకోల టార్చర్ కి చుక్కలు… చూస్తే దిమాక్ ఖరాబ్

Thriller movie OTT: దీవిలో భార్యతో ఏకాంతంగా… సైకోల టార్చర్ కి చుక్కలు… చూస్తే దిమాక్ ఖరాబ్
Advertisement

Thriller movie OTT : ఓటీటీలో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలే దర్శనం ఇస్తూ ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సస్పెన్స్ తో పిచ్చెక్కించే ఒక సినిమా గురించి చెప్పుకుందాం. ఒక్కో నిమిషం వణికిపోతూ ఉంటారు కొన్ని సీన్స్ చూస్తుంటే ఈ సినిమాలో. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ, ఒక జంట సరదా కోసం వెకేషన్ కి వెళ్ళాక భయంకరమైన మలుపులు తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో హింస, క్రూరమైన సీన్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది అందరికీ సరిపోకపోవచ్చు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఆస్ట్రేలియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కిల్లింగ్ గ్రౌండ్’ (Killing Ground). డామియన్ పవర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యారియెట్ డయ్యర్ (సామ్), ఇయాన్ మెడోస్ (ఇయాన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది. ఈ సినిమా నాన్-లీనియర్ పద్ధతిలో సాగుతుంది. కాబట్టి ప్రేక్షకులలో ఈ కథ ఉత్కంఠను పెంచుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇయాన్, సామ్ అనే ఒక జంట, ఎంజాయ్ చేద్దామని సిటీ వదిలి అడవిలోకి క్యాంపింగ్‌కి పోతారు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే, పక్కనే ఒక టెంట్ ఖాళీగా ఉంటుంది. లోపల సామాన్లన్నీ అట్లాగే ఉంటాయి కానీ మనుషులు మాత్రం కనపడరు. ఏమైందా అని వీళ్లు ఆరా తీస్తుండగా, సడన్‌గా ఒక చిన్న పిల్లోడు అడవిలో ఏడుస్తూ వీళ్లకు తగులుతాడు. ఆ పిల్లోడిని చూశాక వీళ్లకి మ్యాటర్ అర్థం కాదు కానీ ఏదో తేడా కొడుతోందని భయం మొదలవుతుంది. కట్ చేస్తే, ఆ అడవిలో ఇద్దరు లోకల్ మనుషులు ఉంటారు. వీళ్లు మామూలు మనుషులు కాదు, సైకోలు. అంతకుముందు వచ్చిన ఒక ఫ్యామిలీని దారుణంగా వేటాడి చంపి ఉంటారు. ఆ ఫ్యామిలీలో మిగిలినోడే ఆ పిల్లోడు.

ఇప్పుడు ఈ జంట కూడా అదే సైకోల కంట పడతారు. ఆ కిరాతకులు వీళ్లను కూడా వేటాడటం మొదలుపెడతారు. మనుషుల కంటే క్రూర మృగాల్లాగా ఆ సైకోలు చేసే రచ్చ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఆపదలో ఉన్నప్పుడు అసలు రంగు బయటపడుతుంది అన్నట్టు.. తన గర్ల్ ఫ్రెండ్‌ని, ఆ పిల్లోడిని కాపాడాల్సిన హీరో, భయంతో వాళ్లను వదిలేసి పారిపోతాడు. కానీ సామ్ మాత్రం వెనకడుగు వేయకుండా, ఆ ఇద్దరు సైకోలతో ఒంటరిగా పోరాడుతుంది. చివరికి ఆ సైకోలను ఆమె అంతం చేస్తుందా ? వాళ్ళ చేతుల్లో బలవుతుందా ? అనే విషయాలను మాత్రం, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న నానా పటేకర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×