E-Paper
Advertisement

Bombs Iran Oil Depots: ఇరాన్‌ చమురు డిపోలపై వరుసగా బాంబులదాడి, ఎగిసిపడిన మంటలు

Bombs Iran Oil Depots: ఇరాన్‌ చమురు డిపోలపై వరుసగా బాంబులదాడి, ఎగిసిపడిన మంటలు
Advertisement

Bombs Iran Oil Depots: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. తొలివారం సైనిక స్థావరాలు, అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఈసారి ఇరాన్ లోని చమురు క్షేత్రాలు, ఆయిల్ డిపోలపై ఫోకస్ చేశాయి. తాజాగా శనివారం రాత్రి అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో మూడు ఇరాన్ చమురు డిపోలు దగ్గరమయ్యాయి. దీనికి సంబందించి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఇరాన్‌ చమురు డిపోలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఎగిసిపడిన మంటలు

Advertisement

ఇరాన్‌పై మరింత దూకుడు పెంచాయి అమెరికా-ఇజ్రాయెల్. తొలివారం కేవలం సైనిక స్థావరాలు అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఇప్పుడు ఇరాన్‌కు ఆర్థిక వ్యవస్థకు జీవనాడి చమురు డిపోలపై శనివారం రాత్రి నుంచి వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. దాడుల తర్వాత ఆ ప్రాంతమంతా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.

ఈ ప్రాంతం నుంచి ఇరాన్‌ సైన్యం సహా పలు శాఖలకు ఆయిల్ తరలిస్తుంటుందని ఐడీఎఫ్‌ తెలిపింది. ఆ దేశ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో కీలక అడుగు పడిందని పేర్కొంది. గతవారం దాడుల తర్వాత ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిపిన మొదటి దాడులు ఇవే. టెహ్రాన్, అల్బోర్జ్ ప్రావిన్సులోని చమురు నిల్వ డిపోలను లక్ష్యంగా చేసుకున్నాయి.

Advertisement

అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు

టెహ్రాన్‌కు పశ్చిమాన కరాజ్‌‌లో ఓ డిపో దెబ్బతింది. గత జూన్‌లో ఇజ్రాయెల్ దాడి చేసిన వాయువ్య టెహ్రాన్‌లోని షహ్రాన్ చమురు డిపోను మళ్ళీ ఢీ కొట్టడంతో ఆకాశంలోకి మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్‌లో చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్‌పై దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. మొత్తం మూడు డిపోల్లో మంటలు వ్యాపించినట్లు వెల్లడించింది.

అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారని ఇరాన్ తెలిపింది. ఆయిల్ డిపోలు డ్యామేజ్ అయిన మాత్రాన ఇంధనం కొరత ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పింది. వాటిపై దాడులు చేస్తాయని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.  ఈ దాడుల తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-IRGC దూకుడు ప్రదర్శించింది.

ALSO READ: మాట తప్పిన ఇరాన్.. దుబాయ్‌లోని మెరీనా టవర్స్‌‌పై డ్రోన్ల దాడి, ఆపై మంటలు

హైఫాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించింది. కంపెనీ కాంప్లెక్స్ సమీపంలోని అల్-మార్సాలోని అమెరికా సైనిక ప్రధాన కార్యాలయాన్ని తాకినట్లు IRGC తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపై డ్రోన్లతో దాడులు చేసింది. స్డోట్ మిచా వద్ద ఇజ్రాయెల్ సైనిక స్థావరంలోని రాడార్ వ్యవస్థలపై దాడులు చేసినట్టు తెలిపింది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×