E-Paper
Advertisement

‘ది వాకింగ్ డెడ్: డారిల్ డిక్సన్ సీజన్ 4’ లోడింగ్… క్రేజీ హింట్ ఇచ్చిన హీరో

‘ది వాకింగ్ డెడ్: డారిల్ డిక్సన్ సీజన్ 4’ లోడింగ్… క్రేజీ హింట్ ఇచ్చిన హీరో
Advertisement

Zombie Web Series : జాంబీ జానర్లో వచ్చే సినిమాలు, సిరీస్ లకు ఎప్పటికీ ఆదరణ పీక్స్ లో ఉంటుంది. అలాంటి ఓ క్రేజీ సిరీస్ లో కొత్త పార్ట్ కోసమే ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ తో హీరో ఇచ్చిన హింట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కానీ ఇదో హాలీవుడ్ జాంబీ సిరీస్. మరి ఈ సిరీస్ పేరేంటి ? ఎక్కడ ఎప్పుడు చూడొచ్చు ? ఇప్పుడు దానిపై వచ్చిన అప్డేట్ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

హీరో ఇచ్చిన హింట్

ప్రపంచవ్యాప్తంగా హారర్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్న సిరీస్ ‘ది వాకింగ్ డెడ్: డారిల్ డిక్సన్’ (The Walking Dead: Daryl Dixon). దీనికి సంబంధించిన ఒక భావోద్వేగపూర్వక అప్‌డేట్ వచ్చింది. సీజన్ 4 చిత్రీకరణ పూర్తయిందని, ప్రధాన నటుడు నార్మన్ రీడస్ (డారిల్ డిక్సన్) సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సమాచారం వెలువడ్డంతో ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మంగోలియాలో షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన నార్మన్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. “చివరి ఎపిసోడ్ ఫోటోలు చూస్తున్నాను. వాటిలో ఏ ఒక్కటి కూడా తొలగించడం లేదా వదిలివేయడం చాలా కష్టంగా ఉంది” అని రాశారు. “నేను ఆ ఫోటోలను ఇక్కడ పోస్ట్ చేయడం లేదు, కానీ మీరందరూ ఈ సీజన్ చూడాలని కోరుకుంటున్నాను. ఈ సిరీస్‌ లో పని చేయడం నా జీవితంలో అత్యుత్తమ అనుభవాల్లో ఒకటి. చాలా కష్టపడి, హృదయపూర్వకంగా ఈ సీజన్‌ను తీశాం. ఇది పూర్తిగా భిన్నమైన, ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వబోతోంది. మీరు వీలైనంత త్వరగా దీన్ని చూడాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

4వ సీజన్ ఎప్పుడంటే ?

Advertisement

‘ది వాకింగ్ డెడ్’ ఫ్రాంచైజీలో డారిల్ డిక్సన్ స్పిన్-ఆఫ్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. జాంబీ అపోకలిప్స్ నేపథ్యంలో డారిల్ సోలో యాత్ర, కొత్త శత్రువులు, కొత్త స్నేహాలు, ఉత్కంఠభరితమైన సర్వైవల్ స్టోరీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. IMDbలో 7.5 రేటింగ్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది ఈ సిరీస్. సీజన్ 4 షూటింగ్ పూర్తయినా, విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. Prime Videoలో మొదటి మూడు సీజన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సీజన్ 4 కూడా ఇక్కడే స్ట్రీమింగ్ అవుతుంది. అంతలోగా ఇప్పటిదాకా ఇంకా ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి. ఇందులో డారిల్ డిక్సన్ ప్రయాణం ముగిసినా, ఈ సిరీస్ హారర్, సర్వైవల్, ఎమోషన్ లవర్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. జాంబీ మూవీ లవర్స్ ను ఈ సిరీస్ పొరపాటున కూడా చూపుతిప్పుకోనివ్వదు.

Read Also : శబ్దం చేస్తే పోతారు… గూస్ బంప్స్ తెప్పించే సై-ఫై థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×