E-Paper
Advertisement

విదేశాలకు వెళ్ళే వాళ్లే టార్గెట్… అవయవాల అక్రమ రవాణాతో హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా

విదేశాలకు వెళ్ళే వాళ్లే టార్గెట్… అవయవాల అక్రమ రవాణాతో హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా
Advertisement

Crime Thriller Series : బాగా చదివి, రెండు చేతులా సంపాదించాలని చాలామంది కలలు కంటారు. అందుకోసం విదేశాలకు వెళ్ళి మంచి జాబ్ చేయాలి అనుకుంటారు. కానీ తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ను చూశాక అదెంత ప్రమాదకరమో తెలిస్తే గుండె జారిపోతుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాల్లోకి వెళ్తే…

స్ట్రీమింగ్ ఫ్రీగానే…

అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌ (MX Player)లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అబ్ హోగా హిసాబ్’ (Abb Hoga Hisaab). షహీర్ షేక్, సంజయ్ కపూర్, మౌని రాయ్, హర్మాన్ సింఘ్, అవినాష్ మిశ్రా లాంటి స్ట్రాంగ్ కాస్ట్‌తో దివ్యాంశు మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న అమాయక యువకులను టార్గెట్ చేసి, వారి అవయవాలను అక్రమంగా విక్రయించే భయంకరమైన ఆర్గాన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సిరీస్ ను చూశాక విదేశాలకు వెళ్లాలంటేనే పక్కాగా వణికిపోతారు.

కథలోకి వెళ్తే…

Advertisement

బాబీ (షహీర్ షేక్) కెనడాలో ఉద్యోగం చేస్తూ డిపోర్ట్ అయి ఇండియాకు తిరిగి వస్తాడు. అక్కడ అతను పడ్డ కష్టాలు, అవమానాలు చూసి మరోసారి అక్కడికి వెళ్లొద్దు అని నిర్ణయించుకుంటాడు. ఇన్ని చుసిన అతను తన తమ్ముడు బంటి (అవినాష్ మిశ్రా) భవిష్యత్తు బాగుండాలని, ఎలాగైనా అతన్ని కెనడా పంపించాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో గోల్డీ (సంజయ్ కపూర్) అనే ఆర్గాన్ మాఫియా కింగ్‌పిన్ కథలోకి ఎంట్రీ ఇస్తాడు.

విదేశాలకు వెళ్లాలనుకునే యువకులే వీళ్ళ టార్గెట్. అలాంటి యూత్ కు ఆశ చూపి, మత్తు మందులు ఇచ్చి వారి అవయవాలను అక్రమంగా విక్రయించే ఈ నెట్‌వర్క్‌ను గోల్డీ నడుపుతుంటాడు. అతని కుడి భుజంగా కామ్నా (మౌని రాయ్) ఉంటుంది. ఆమె హెల్ప్ తో ఇలాంటి దారుణాలకు ఒడిగడతారు. ఇక్కడే ఇన్‌స్పెక్టర్ దొసాంజ్ (హర్మాన్ సింఘ్) కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు. బాబీ, బంటి జీవితాలు ఈ మాఫియా నెట్‌వర్క్‌లో చిక్కుకుపోతాయి.

Advertisement

ఈ భయంకరమైన ఆర్గాన్ ట్రేడింగ్ ముఠా నుంచి వారు ఎలా తప్పించుకుంటారు ? చివరకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటారు ? అనేది సిరీస్ మొత్తాన్ని ఉత్కంఠభరితంగా నడిపిస్తుంది. రియల్ లైఫ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, ఆర్గాన్ ట్రాఫికింగ్ సమస్యలను ధైర్యంగా ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫాస్ట్ పేస్ నెరేషన్, ట్విస్టులు, ఇంటెన్స్ సీన్స్, పంజాబ్ బ్యాక్‌డ్రాప్, రియలిస్టిక్ స్టోరీటెల్లింగ్ ఇందులో ప్లస్ పాయింట్స్. ఇక వలస కలలు కనే యువకులు ఎదుర్కొనే నిజమైన ప్రమాదాలను కూడా హైలైట్ చేసి చూపించారు. ఒక్కసారి చూస్తే చివరి ఎపిసోడ్ వరకు కట్టిపడేస్తుంది ఈ సిరీస్.

Read Also : ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన సిరీసులు… ‘ధురందర్ 2’ వ్యూస్ ఎంతంటే ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×