E-Paper
Advertisement

పిట్టల్లా రాలిపోయే సైనికులు… మిగిలిన ఒకే ఒక్కడి ఊచకోతతో కాటేరమ్మ జాతర

పిట్టల్లా రాలిపోయే సైనికులు… మిగిలిన ఒకే ఒక్కడి ఊచకోతతో కాటేరమ్మ జాతర
Advertisement

Action Thriller Series OTT: యుద్ధభూమిలో సైనికులు పిట్టల్లా రాలిపోవడం, దేశం కోసం ప్రాణాలు అర్పించడం చూస్తే గుండె తరుక్కుపోతుంది. కానీ అదే సైనికులను తాము నమ్ముకున్న స్వంత ఆర్మీనే నట్టేట ముంచేస్తే… ఎంత దారుణంగా ఉంటుందంటే కోపంతో రక్తం ఉడికిపోతుంది. మనకే ఇలా ఉంటే… ఆ సైన్యాన్ని నడిపించే కమాండోకి ఎలా ఉంటుంది ? అది తెలియాలంటే ‘The Terminal List’ (ది టెర్మినల్ లిస్ట్) అనే ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ను తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మాజీ కమాండో తన టీమ్ మరణానికి కారణమైన వ్యవస్థపై, పెద్దలపై ఒంటరిగా జరిపే ప్రతీకార పోరాటమే ఈ మూవీ స్టోరీ. ఇందులో ప్రధాన పాత్రధారి జేమ్స్ రీస్ (Chris Pratt). ఆయనొక సీనియర్ నేవీ సీల్ (Navy SEAL) కమాండోగా పని చేస్తాడు. అతని నాయకత్వంలో ఒక సీక్రెట్ మిషన్ కోసం వెళ్లిన అతని సైనిక బృందం మొత్తం శత్రువుల దాడిలో దారుణంగా చనిపోతుంది. ఆ ప్రమాదం నుండి జేమ్స్ రీస్ ఒక్కడే ప్రాణాలతో బయట పడతాడు. కానీ అక్కడి నుంచి బయట పడినప్పటికీ అతనికి మతిమరుపు వస్తుంది. అయినప్పటికీ హీరోకి వచ్చే ఏ అనుమానం కథను మలుపు తిప్పుతుంది.

Advertisement

తిరిగి ఇంటికి వచ్చిన రీస్‌ కు ఆ మిషన్ రోజు ఏం జరిగిందనే విషయాలు పెద్దగా గుర్తుండవు. అందుకే తన తప్పు వల్లే తన బృందం చనిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ తన టీమ్‌ ని ఎవరో కావాలనే కుట్ర చేసి చంపేశారని రీస్‌ కు గట్టిగా నమ్ముతాడు. ఈ ఘటనకు సంబంధించిన నిజాలను రీస్ కనిపెట్టే లోపే ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంటుంది. ఓ రోజు రాత్రి కొందరు గుర్తుతెలియని హంతకులు అతని ఇంటిపై దాడి చేస్తారు. ఆ దాడి నుంచి హీరో తప్పించుకుంటాడు. కానీ అతని భార్యను, చిన్న కూతురిని దారుణంగా చంపేస్తారు. తన కళ్ల ముందే కుటుంబాన్ని కోల్పోయిన రీస్ దీనికి కారణమైన వాళ్ళను వదిలి పెట్టకూడదు అని డిసైడ్ అవుతాడు.

హీరో ఇన్వెస్టిగేషన్ లో తన కుటుంబం, తన టీమ్ మరణాల వెనుక అమెరికా ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు, సొంత డిపార్ట్‌మెంట్‌కు చెందినవారే ఉన్నారని తెలుసుకుంటాడు. దాంతో వాళ్లందరి పేర్లతో ఒక ‘టెర్మినల్ లిస్ట్’ అంటే చంపాల్సిన వారి జాబితా తయారు చేస్తాడు. ఇక్కడే ఊచకోత మొదలవుతుంది. ఒక సైనికుడిగా తనకున్న యుద్ధ విద్యలన్నింటినీ ఉపయోగించి, ఆ లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్కరిని రీస్ ఎలా వెంటాడి వేటాడి చంపాడు ? అసలు ఆ కుట్ర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్‌ ను Amazon Prime Video లో చూడవచ్చు. ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఆడియోటో స్ట్రీమింగ్ అవుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఇది యాక్షన్ ప్రియులకు విందులా ఉంటుంది. ఈ ఆర్మీ యాక్షన్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉంటుంది.

Advertisement

Read Also: రాయితో బాయ్ ఫ్రెండ్ తల పగలగొట్టే అమ్మాయి… ‘దృశ్యం’ రేంజ్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×