E-Paper
Advertisement

OTT Movie : టీచర్ పై స్టూడెంట్స్ అఘాయిత్యం… ఇదెక్కడి దిక్కు మాలిన మూవీ

OTT Movie : టీచర్ పై స్టూడెంట్స్ అఘాయిత్యం… ఇదెక్కడి దిక్కు మాలిన మూవీ
Advertisement

OTT Movie : ఇప్పుడు ఎటువంటి సినిమాలు అయినా సరే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీని ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఫాలో అవుతున్నారు. భాషతో సంబంధం లేకుండా వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ సినిమా స్టోరీ ఒక లేడీ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే … 

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది టీచర్’ (The Teacher). 2022లో విడుదలైన ఈ మలయాళ మూవీకి వివేక్ దర్శకత్వం వహించారు. Nutmeg ప్రొడక్షన్స్, VTV ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీలో అమలా పాల్, చెంబన్ వినోద్ హక్కిమ్ షా, మంజు పిళ్లై ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డాన్ విన్సెంట్ సంగీతం అందించారు. ‘అతిరన్’ సినిమా తర్వాత వివేక్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ఇది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే …

Advertisement

దేవిక అనే మహిళ ఒక కాలేజ్ లో టీచర్ గా పని చేస్తుంటుంది. ఆమె తన భర్త సుజిత్ తో సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటుంది. ఒక రోజు ఆమె కాలేజ్ లో ఏర్పాటు చేసిన ఒక ఫంక్షన్ కి వెళ్తుంది. అయితే మరుసటి రోజు ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు, తన శరీరంపై గాయాలు ఉంటాయి.  నిన్న ఏం జరిగిందో అస్సలు గుర్తు ఉండదు. తన శరీరంపై ఉన్న గాయాలను పరిశీలిస్తున్నప్పుడు,  తనపై లైం*గిక దాడి జరిగిందని తెలుసుకుని బాధపడుతుంది. ఆమెకు డ్రగ్ ఇచ్చి ఆ పాడు పని చేస్తూ, కొంత మంది యువకులు దాన్ని వీడియో తీశారని తెలుస్తుంది. ఆ వీడియో కూడా వైరల్ అవ్వడంతో, ఆమె జీవితం తలకిందులు అవుతుంది.

Read Also : ఈ సినిమాను చూస్తే హార్రర్ మూవీ లవర్స్ కు ఎంజాయ్ పండగో… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

భర్త సుజిత్ అర్థం చేసుకోకుండా, ఈ విషయంలో ఆమెనే నిందిస్తాడు. ఇది ఆమెను మరింత ఒంటరిని చేస్తుంది. అయితే దేవిక కల్యాణి అనే ఒక కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ మద్దతుతో న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంటుంది. దేవిక తనపై దాడి చేసిన వారిని గుర్తించి, వారిని శిక్షించాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తుంది. చివరికి ఆమెపై అఘాయిత్యం చేసింది ఎవరు ? వాళ్ళను దేవిక ఎలా శిక్షిస్తుంది ? భర్త ఆమెను మళ్ళీ దగ్గరకు తీసుకుంటాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×