E-Paper
Advertisement

OTT Movie : మగాడి కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించిన మూవీ… పడి పడి నవ్విస్తూనే, ఏడిపించారు భయ్యా

OTT Movie : మగాడి కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించిన మూవీ… పడి పడి నవ్విస్తూనే, ఏడిపించారు భయ్యా
Advertisement

OTT Movie : మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఒక తమిళ్ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ తమిళ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.  తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే

జీ 5 (Zee 5) లో

Advertisement

ఈ తమిళ కామెడీ మూవీ పేరు ‘కుటుంబస్థాన్’ (Kudumbasthan). 2025 లో వచ్చిన ఈ మూవీకి రాజేశ్వర్ కాళీసామి దర్శకత్వం వాహంచారు. ఇందులో కె. మణికందన్, సాన్వే మేఘన ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్. సుందర్‌రాజన్, గురు సోమసుందరం, కుదస్సనాద్ కనకం, నివేద రాజప్పన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కుటుంబస్థాన్ ‘ 2025 జనవరి 24 న థియేటర్లలో విడుదలై, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ కి ఎక్కింది. ఈ స్టోరీ నవీన్ అనే మధ్యతరగతి యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈమూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

నవీన్ అనే ఒక మధ్యతరగతి యువకుడు, వెన్నిలా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్ళ కులాలు వేరు కావడంతో ఈ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరు. అయినప్పటికీ వారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని, కోయంబత్తూరులో నవీన్ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తారు. నవీన్ ఒక్కడే అతని కుటుంబాన్ని పోషించాల్సి వస్తుంది. ఆయితే అతని తల్లి వెన్నిలాను ఆమె కులం కారణంగా సూటి పోటీ మాటలు అంటుంది. అతని తండ్రి కొత్త ఖర్చుల గురించి ఎప్పుడూ నవీన్ కు చెబుతూ ఉంటాడు.

ఇదిలా ఉంటే వెన్నిలా గర్భవతి కావడంతో వారి జీవితంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఒక రోజు నవీన్ తన కంపెనీలో ఒక కొలీగ్ తో గొడవపడతాడు. అతని తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో ఉద్యోగం కోల్పోతాడు. ఇది అతని జీవితంలో మరింత ఆర్థిక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. కుటుంబ ఖర్చులు, అప్పుల ఒత్తిడితో నవీన్ ఇబ్బందులు పడతాడు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచి పెడతాడు.

Read Also : వందేళ్ల వయసులో భార్యమీద అనుమానం… విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే వృద్ధుడు… ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

తరువాత ఇంట్లో తెలిసిస్ అతనితో ఒక బేకరీ వ్యాపారం స్టార్ట్ చేయిస్తారు. కానీ పోటీ కారణంగా అది అంతగా నడవకపోవడంతో మరిన్ని కష్టాలు వస్తాయి. కొండన్ని అప్పులు మరింత పెరుగుతాయి. మరోవైపు వెన్నిలా UPSC ప్రిలిమ్స్ క్లియర్ చేస్తుంది. నవీన్ పడుతున్న ఇబ్బందులను చూసి వెన్నిలా అతని మాజీ బాస్ మోహన్ రామ్ ను కలసి ఉద్యోగాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. అయితే ఈ విషయం నవీన్‌ కు తెలిసి అతని ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఈ దంపతుల మధ్య వాదన జరుగుతుంది. వెన్నిలా ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా ? అని బాధపడుతుంది. చివరికి నవీన్ కష్టాలు తీరుతాయా ? భార్య, భర్తలు సంతోషంగా ఉంటారా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకండా చూడండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×