E-Paper
Advertisement

Angammal OTT: ఓటీటీలోకి తమిళ్ హార్ట్ టచింగ్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే..?

Angammal OTT: ఓటీటీలోకి తమిళ్ హార్ట్ టచింగ్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Angammal OTT: తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు అటు తమిళ ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో వచ్చేస్తున్నాయి. చిన్న స్టోరీ తో వచ్చిన సినిమాలే ఈ మధ్య బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. అలాంటి ఓ చిన్న స్టోరీ తో వచ్చిన సినిమానే అంగమ్మాల్‌.. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళ ప్రముఖ డైరెక్టర్ కె.బాలచందర్‌ కోడలైన గీత కైలాసం ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. గ్రామీణ కథతో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది నవంబర్ 21 థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీల్లోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్? స్ట్రీమింగ్ ఎప్పుడో ఒకసారి చూసేద్దాం..

‘అంగమ్మాల్‌’ ఓటీటీ డేట్?

తమిళ ఫీల్ గుడ్ మూవీ అంగమ్మాల్‌ థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూడొచ్చు.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్స్ట్‌లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది.. అయితే ఈ సినిమా కేవలం తమిళం లో మాత్రమే రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా అందుబాటులో కి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ డేట్ గురించి పూర్తి వివరాలను సన్ నెక్స్ట్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది..

Advertisement

Also Read :ఐబొమ్మ రవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు..జీవితాంతం జైల్లోనే..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

సినిమా టైటిల్ ను చూస్తే ఇదొక అమ్మాయి స్టోరీలాగా కనిపిస్తుంది. తన జీవితంలో జాకెట్ అనేది తెలియకుండా పెరిగిన ఒక అమ్మాయి కదా.. జీవితంలో ఎప్పుడూ అలాంటిది చూడనే లేదు. రవి కంటే ఏంటో కూడా తెలియని ఆమె బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. పెద్దకొడుకు ఆమెతోనే ఉంటాడు. కానీ చిన్న కొడుకు మాత్రం పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు. అక్కడ వాతావరణం లో అతను చాలా మారిపోతాడు.. అంతేకాదు తన చదువుతో పాటు అలవాట్లు కూడా పూర్తిగా మార్చుకుంటాడు. అక్కడే ఉండే ఒక అమ్మాయి తో ప్రేమలో పడతాడు. వాళ్లది హై క్లాస్ కుటుంబం. ఆ అమ్మాయి కుటుంబంలో అబ్బాయి అందరికీ బాగా నచ్చుతాడు. దాంతో అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం మాట్లాడాలని అనుకుంటారు. తన ఇంట్లో పెళ్లి సంబంధానికి వస్తే వాళ్ళ అమ్మ జాకెట్ వేసుకోవాలన్న విషయం తెలిస్తే బాగోదు అని తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో పాటుగా జాకెట్టు వేసుకోమని చెప్తాడు. మరి జీవితంలో ఎప్పుడూ రవిక చూడని ఆమె తన కొడుకు జీవితం కోసం మరి వేసుకుంటుందా..? లేదా తన పద్ధతిని మార్చుకోకుండా తన కొడుకుని బాధ పెడుతుందా? ఆ తర్వాత స్టొరీ ఏంటో తెలియాలంటే కచ్చితంగా సినిమాని చూడాల్సిందే..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×