E-Paper
Advertisement

Film industry: నిర్మాతలుగా మారిన సెలబ్రిటీ సిస్టర్స్.. ఎవరెవరంటే?

Film industry: నిర్మాతలుగా మారిన సెలబ్రిటీ సిస్టర్స్.. ఎవరెవరంటే?
Advertisement

Film industry:ఈమధ్యకాలంలో సెలబ్రిటీల వారసులు సినీ ఇండస్ట్రీలో ఉండే 24 శాఖలలో ఏదో ఒక శాఖలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా.. మరికొంతమంది హీరోయిన్లుగా సెటిల్ అవుతుంటే ఇంకొంతమంది సెలబ్రిటీల వారసులు మాత్రం డైరెక్షన్, ప్రొడక్షన్ విభాగంలో సెటిల్ అవుతూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇంకొంతమంది ఇండస్ట్రీకి దూరంగా వ్యాపారాలు చేసుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఒక సెలబ్రిటీకి ఇద్దరు పిల్లలు ఉంటే.. వారిద్దరూ వేరువేరు రంగాలలో కొనసాగుతున్నారు. కానీ ఇక్కడ కొంతమంది సెలబ్రిటీలకు చెందిన వారసురాళ్లు మాత్రం నిర్మాతలుగా కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి నిర్మాతలుగా కొనసాగుతున్న ఆ సెలబ్రిటీ సిస్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

వరలక్ష్మీ శరత్ కుమార్ – పూజా శరత్ కుమార్:

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఈమె స్వీయ దర్శకత్వంలో సోదరీ పూజా శరత్ కుమార్ తో కలిసి ‘సరస్వతి’ అనే న్యూ ఏజ్ థ్రిల్లర్ ను రూపొందిస్తున్నారు. పైగా ఈ చిత్రానికి వీరిద్దరూ నిర్మాతలు కూడా.. అలా వీరిద్దరూ కలిసి నిర్మాతలుగా మారారు. ఇప్పుడు సరస్వతి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. జీవ , ప్రకాష్ రాజ్ , ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా హై కాన్సెప్ట్ మూవీ అని వరలక్ష్మి కూడా చెప్పుకొచ్చింది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా వీరికి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

ప్రియాంక దత్ – స్వప్న దత్:

Advertisement

ప్రముఖ బడా నిర్మాత అశ్వినీ దత్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు స్వప్న దత్, ప్రియాంక దత్. దత్ సిస్టర్స్ అయిన వీరు స్వప్న సినిమాస్, వైజయంతి బ్యానర్లపై పలు చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ లేడీ ప్రొడ్యూసర్స్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతి రత్నాలు, సీతారామం, అన్నీ మంచి శకునములే, కల్కి 2898AD, ఛాంపియన్ వంటి చిత్రాలను సంయుక్తంగా నిర్మించి మంచి పేరు దక్కించుకున్నారు.

అలా నిర్మాతలుగా ఈ సిస్టర్స్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్ సిస్టర్స్ కూడా నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరు గనుక సక్సెస్ అయితే ఈ జాబితాలోకి ఇంకొంతమంది సెలబ్రిటీ సిస్టర్స్ నేతలుగా అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ:Maa Inti Bangaram: రెండో పెళ్లి తర్వాత… సమంత కం బ్యాక్ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×