E-Paper
Advertisement

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ నేరస్థులే… ప్యూర్ గా యాక్షన్ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ నేరస్థులే… ప్యూర్ గా యాక్షన్ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ
Advertisement

OTT Movie : ఇండోనేషియన్ సినిమాలలోనే ఇప్పటివరకు వచ్చిన టాప్ బ్రూటల్ యాక్షన్ మూవీల్లో ఒకటిగా నిలిచింది ‘ది నైట్ కమ్స్ ఫర్ అస్’ అనే మూవీ. ఈ సినిమాకి జాకీ చాన్ స్టంట్ టీమ్ కూడా పనిచేసింది. ఇది యాక్షన్ సినిమా అనే కంటే, ఒక రక్తపాత యుద్ధం అని చెప్పుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లు ఈ సినిమాకి దూరంగా ఉండటమే మంచిది. ఒక కిల్లర్ ఏడేళ్ళ పాపను కాపాడే స్టాండ్ తీసుకోవడంతో ఈ బ్లడీ బ్లడ్ బాత్ జరుగుతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇండోనేషియన్ యాక్షన్ మాస్టర్‌పీస్ ‘ది నైట్ కమ్స్ ఫర్ అస్’ (The Night Comes for Us). టిమో త్జాహ్జాంటో దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో ఇకో ఉవైస్, జో తాస్లిం, జూలీ ఎస్టెల్లె, సన్నీ పాంగ్ ఇందులో నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా 2018 అక్టోబర్ 19న రిలీజ్ అయింది. 121 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.9/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇతో అనే వ్యక్తి సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మోస్ట్ డేంజర్ కిల్లర్. ఒక రోజు అతనికి, ఒక గ్రామం మొత్తం ఖతం చేయమని ఆర్డర్ వస్తుంది. ఒక గ్యాంగ్ ని తీసుకెళ్లి అందర్నీ చంపేస్తాడు. కానీ చివర్లో ఒక 7 ఏళ్ల చిన్న పాప రీనా కళ్ల ముందు బతికి నిలబడి ఉంటుంది. ఇతోకి ఒక్కసారిగా మనసు మారిపోతుంది. ఆ పాపని చంపకుండా ఒక్క గన్ షాట్‌తో గ్యాంగ్‌కి రిబెల్ అయిపోతాడు. రీనాని ఎత్తుకొని జకార్తా రోడ్ల మీద పారిపోతాడు. ఇక అంతే… గ్యాంగ్ పూర్తి ఫోర్స్‌తో ఇతో, రీనా వెనకాల పడుతుంది. అతనికి డీల్ ఇచ్చిన బాస్ అతన్ని చంపని ఆర్డర్ వేస్తారు. ఇప్పుడు ఇతో ఒక్కడే… ఒక చిన్న పాప కోసం పూర్తి గ్యాంగ్‌తో యుద్ధం మొదలెడతాడు.

Read Also : భర్త ఉండగానే మరొకరిని రెచ్చగొట్టే భార్య… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ మావా… క్లైమాక్స్ ట్విస్ట్ కేక

Advertisement

ఇక మూవీ మొత్తం ఒక్కటే రక్తపాతంతో నడుస్తుంది. ఇతో పాత ఫ్రెండ్స్, పాత లవర్, పాత ఎనిమీస్ అందరూ రంగంలోకి దిగుతారు. గన్, ఐరన్ రాడ్, గాజు బాటిల్ ఏది దొరికితే దాంతో ప్రాణాలను తీసేస్తుంటాడు ఇతో. ఏ సీన్ చూసినా ఒక్క సెకను కూడా బ్రీత్ తీసుకోలేం. అంతలా బ్లడ్ బాత్ ఉంటుంది. చివరి 40 నిమిషాల్లో ఒక కార్ పార్కింగ్ లాట్‌లో జరిగే ఒక్కే ఒక్క ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది. చివరికి ఇతో రీనాని కాపాడగలడా? లేక గ్యాంగ్ గెలుస్తుందా? అనేదే ఫైనల్ బ్లడ్ బాత్ లో చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×