E-Paper
Advertisement

OTT Movie : బ్లడీ వయోలెన్స్… అఘాయిత్యం చేసిన వాడికే ఆర్గాన్స్ ఇచ్చే అమ్మాయి… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : బ్లడీ వయోలెన్స్… అఘాయిత్యం చేసిన వాడికే ఆర్గాన్స్ ఇచ్చే అమ్మాయి… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్
Advertisement

OTT Movie : ఒక కొరియన్ రివెంజ్ థ్రిల్లర్ సినిమా ఊహించని మలుపులతో ఆకట్టుకుంటోంది. ఒక ఒంటరి మహిళకు జరిగిన తీవ్రమైన వేధింపుల కారణంగా, రివెంజ్ తీర్చుకొనే సీన్స్ ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఎప్పుడూ చూడని క్లైమాక్స్ కూడా ఇందులో ఉంది. క్లైమాక్స్ ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Advertisement

ఈ కొరియన్ సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది లాస్ట్ చాయిసెస్’ (The Lost Choices). 2015లో విడుదలైన ఈ కొరియన్ సినిమాకి అహన్ యాంగ్-హూన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షిన్ హ్యున్-బిన్, యూన్ సో-యి, కిమ్ హ్యోక్-ఇల్, అహన్ సే-హా, జో యంగ్-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సమాజంలోని 108 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 2015 అక్టోబర్ 29న దక్షిణ కొరియాలో విడుదలైంది. IMDbలో 6.3/10, Rotten Tomatoesలో 80% రేటింగ్‌ను పొందింది. Amazon Prime Video లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

చే జి-యున్ (షిన్ హ్యున్-బిన్) అనే యువతి తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించిన తర్వాత మాట్లాడే లోపం (స్టటరింగ్)తో బాధపడుతుంటుంది. ఒకప్పుడు షార్ప్‌షూటర్‌గా ఉన్న జి-యున్, తన లోపాన్ని అధిగమించి గ్రాఫిక్ డిజైనర్ కావాలని కలలు కంటుంది. ఆమె ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో బటన్-పుషర్‌గా పనిచేస్తూ, తన స్నేహితురాలు వోన్-క్యుంగ్ (లిమ్ సియో-జూ)తో కలిసి జీవిస్తుంది. ఆమె పర్మనెంట్ ఉద్యోగం కోసం తన బాస్‌తో ఎఫ్ఫైర్ పెట్టుకుంటుంది. ఒక రోజు ఇంటికి తిరిగి వెళ్తున్న జి-యున్ ను ముగ్గురు అపరిచితులు ఒక ఖాళీ భవనంలోకి లాగి ఆమెపై అఘాయిత్యం చేస్తారు. ఈ దారుణమైన సంఘటన ఆమె జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది.

జి-యున్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. కానీ డిటెక్టివ్ పార్క్ (కిమ్ హ్యోక్-ఇల్) ఆమె చెప్పే కథను నమ్మడు. ఈ పని ఇష్టపూర్వకమైనదేనా అని తిరిగి ప్రశ్నిస్తూ, ఆమెను అవమానిస్తాడు. న్యాయ వ్యవస్థ, సమాజం నుంచి ఆమెకు న్యాయం జరగదు. జి-యున్ కోపంతో రగిలిపోతుంది. ఆమె తనను దాడి చేసిన వారిపై, పోలీసులపై, ఆమెను నమ్మని ప్రతి ఒక్కరిపై రివెంజ్‌ తీర్చుకోవడం మొదలుపెడుతుంది. ఆమె షార్ప్‌షూటింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, ఈ దుర్మార్గులను ఒక్కొక్కరినీ లక్ష్యంగా చేసుకుంటుంది.

ఈ సమయంలో డిటెక్టివ్ కాంగ్ జా-గ్యుమ్ (యూన్ సో-యి) అనే ఒక మహిళా పోలీసు అధికారి జి-యున్ కేసును విచారిస్తుంది. కాంగ్, జి-యున్ పట్ల సానుభూతి చూపుతుంది. ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. చిత్రం ఒక విషాదకరమైన ట్విస్ట్‌తో ముగుస్తుంది. జి-యున్ తన రివెంజ్‌ ను పూర్తి చేస్తుందా ? కాంగ్ ఈ కేసును ఎలా ఎదుర్కొంటుంది ? క్లైమాక్స్ ట్విస్ట్‌ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Read Also : అమ్మాయితో ఫ్యామిలీ అంతా కలిసి ఆ పని… ఆమె రివేంజ్ రా అండ్ బ్రూటల్… బ్లడీ బ్లడ్ బాత్ భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×