E-Paper
Advertisement

పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా

పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా
Advertisement

Action thriller movie : ఒక మూగ తండ్రి… తన కూతురి కోసం మొత్తం అండర్‌ వరల్డ్‌ను ఒంటి చేత్తో ఎదుర్కొన్న అమానుష పోరాటం. ‘టేకెన్’ స్టైల్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను సీటు నుంచి కదలకుండా చేస్తుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కెంజీ తానిగాకి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 జూన్‌లో విడుదలైంది. ఈ రివేంజ్ డ్రామాను, ఆ తండ్రి పడే ఆవేదన, కూతురు కోసం అతను సృష్టించే బ్లడీ బ్లడ్ బాత్ ను చూస్తే తండ్రి అంటే ఇలా ఉండాలి భయ్యా అనిపించక మానదు. ఈ సినిమా పేరు ‘The Furious’.

కథలోకి వెళ్తే…

ఆగ్నేయాసియాలోని అవినీతి రాజ్యమేలే ఒక నగరంలో సాధారణ హోటల్ మెయింటెనెన్స్ వర్కర్‌ గా పని చేస్తాడు వాంగ్ వేయ్ (క్షీ మియావో). ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అతను అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు కలిగిన ఒక మారణాయుధం. చైనాలో ఉండే అతని చిన్న కూతురు రైనీ (యాంగ్ ఎన్యా) స్కూల్ సెలవుల్లో తండ్రిని కలవడానికి వస్తుంది. తనతోనే ఉండాలని ఆమె కోరినా, వాంగ్ వేయ్ ఏదో కారణంతో నిరాకరిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగి, కోపంగా బయటకు వెళ్లిన రైనీని వీధుల్లో ఒంటరిగా ఉంటుంది. అలాంటి టైమ్ లో అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా ముఠా ఆమెను కిడ్నాప్ చేసేస్తుంది.

Advertisement

దీంతో వాంగ్ వేయ్‌ సాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాడు. ఆ నగర పోలీసు వ్యవస్థ అంతా ఆ ముఠా చేతుల్లోనే ఉంది. దీంతో పోలీసులు చేతులు ఎత్తేస్తారు. ఇక తన కూతురిని రక్షించుకోవడానికి అతను ఒక్కడే యుద్ధానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో అతనికి తోడుగా నిలుస్తాడు ఓ జర్నలిస్ట్. తన భార్య అదృశ్యం వెనుక ఉన్న ఆ ముఠాను బయట పెట్టాలని చూస్తున్న పట్టుదలగల ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అతను.

ఈ క్రమలోనే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, ట్రక్ పైన జరిగే హై-ఆక్టేవ్ ఫైట్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ రింగ్‌లో జరిగే ఫైట్, భవనాల రూఫ్‌టాప్‌లో జరిగే రెస్క్యూ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. క్షీ మియావో మార్షల్ ఆర్ట్స్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. మూగ పాత్ర కానీ అతని శరీర భాష, కళ్లు, యాక్షన్ ద్వారా భావాలను అద్భుతంగా వ్యక్తం చేశాడు. జో తస్లిమ్ తన యాక్షన్ ఎనర్జీతో సినిమాకు మరో డైమెన్షన్ ఇచ్చాడు. కథలో భావోద్వేగాలు, తండ్రి-కూతురు బంధం ఎమోషన్, రక్తపాత పోరాటం… అన్నీ బ్యాలెన్స్‌గా ఉన్నాయి. ఒక సాధారణ హోటల్ వర్కర్ నుంచి మారణాయుధంగా మారిన వాంగ్ వేయ్ ప్రయాణం ఎలా సాగింది ? తన కూతురిని కాపాడుకోవడానికి ఒక్కడే గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు ? అనేది స్టోరీ. ఈ ఊచకోతను తెరపై చూస్తే యాక్షన్ ప్రియులకు వచ్చే కిక్కే వేరు. ‘ఫ్యూరియస్’ ఇప్పుడు Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : పెళ్లి పీటలెక్కడానికి ముందే పెను విషాదం… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×