E-Paper
Advertisement

తలలు తెగిపడే శవాలు… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కిల్లర్

తలలు తెగిపడే శవాలు… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కిల్లర్
Advertisement

Suspense Thriller : సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చే జానర్లో సైకో కిల్లర్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన మూవీ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఆ మూవీ తెలుగు మూవీ కావడం మరో విశేషం. 2024 మార్చిలో థియేటర్లలో విడుదలై, తర్వాత ఓటీటీలో సంచలనం సృష్టించిన ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ప్రేక్షకుల మనసులో ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.

కథలోకి వెళ్తే…

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో స్టోరీ సాగుతుంది. అక్కడ గత 18 ఏళ్లుగా జరుగుతున్న భయంకరమైన సీరియల్ కిల్లర్ హత్యలు పోలీసులకు చెమటలు పట్టిస్తాయి. ప్రజలను భయకంపితులను చేస్తాయి. కిల్లర్ లక్ష్యం మాత్రం యువతులే. ప్రతి హత్య తర్వాత శవం వద్ద ‘దిష్టి బొమ్మ’ను వదిలేసి వెళ్లడం ఆ సైకో సిగ్నేచర్ గా మారిపోయింది. ఈ కేసు ఛేదించడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమవుతారు.

Advertisement

అలాంటి సమయంలో ముందుకొస్తాడు లోకల్ ప్రైవేట్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). చిన్నతనంలో తన సోదరుడిని కోల్పోయిన బాధ నుంచి బయటపడి, న్యాయం కోసం పోరాడాలని కలలుకన్న భాస్కర్ ఈ కేసును పర్సనల్ గా తీసుకుంటాడు. అతనికి సాయం చేసేందుకు పొరుగున ఉండే ధైర్యవంతురాలు, జర్నలిస్ట్ లక్ష్మి (రాశి సింగ్), పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పని చేసే స్నేహితుడు ఇంద్రజిత్ ముందుకొస్తారు.

ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంది కొద్దీ హత్యలు సాధారణ సైకోపాత్ చేసినవి కావని, వాటి వెనుక పురాణాలు, తాంత్రికం, బ్లాక్ మ్యాజిక్ దాగి ఉన్నాయని భాస్కర్ గ్రహిస్తాడు. గుల్బర్గా సమీపంలోని శుక్రహళ్లి అనే ప్రాంతంలో దొరికిన పాత తాళపత్ర గ్రంథాలు ఈ కేసుకు కీలకమవుతాయి. శివుడు భస్మం చేసిన భస్మాసురుడు పునర్జన్మ ఎత్తడానికి అతని వంశస్థులు 18 ఏళ్లలో 17 కన్యలను బలి ఇవ్వాల్సి ఉంటుందని తెలుసుకుంటారు. చివరి బలి తర్వాత స్వయంగా అగ్నికి ఆహుతి అవ్వాలని గ్రంథాల్లో ఉంది. ఇప్పటికే 16 హత్యలు జరిగిపోయాయి. 17వ బలి లక్ష్మి అని తెలియడంతో భాస్కర్ గుండె జారిపోతుంది. మరి.క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిఐ శంకర్ గురించి తెలిసే షాకింగ్ నిజం ఏంటి ?.భస్మాసురుడి వంశానికి చెందిన చివరి వ్యక్తి, దీని వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరు ? .భాస్కర్ లక్ష్మిని ఎలా కాపాడాడు ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే. ఈ చిత్రం ప్రస్తుతం Ahaలో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×