E-Paper
Advertisement

OTT Move: మ్యాజిక్ షూ తో మెంటలెక్కించే పనులు… ఒక్కసారిగా మారే జాతకం… నెక్స్ట్ లెవెల్ స్టోరీ

OTT Move: మ్యాజిక్ షూ తో మెంటలెక్కించే పనులు… ఒక్కసారిగా మారే జాతకం… నెక్స్ట్ లెవెల్ స్టోరీ
Advertisement

OTT Move : చెప్పులు మారితే జీవితం మారుతుందని చూపించిన స్వీట్ మ్యాజికల్ జర్నీ ‘ది కొబ్లర్’. ఈ సినిమా చుస్తే నిజంగా అలానే అనిపిస్తుంది. థియేటర్లలో అంతగా విజయం సాధించని ఈ సినిమా, ఓటీటీలో బాగా ట్రెండ్ అయింది. ఆడమ్ సాండ్లర్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఇందులో ఒక చెప్పులు కుట్టే మ్యాజికల్ మిషన్ తో అతను వేరే మనిషి రూపంలోకి మారుతుంటాడు. ఈ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ….

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

టామ్ మెక్‌ డైరెక్షన్ లో వచ్చిన ‘ది కొబ్లర్’ (The Cobbler) మూవీలో ఆడమ్ సాండ్లర్ లీడ్ రోల్ లో నటించాడు. ఈ మ్యాజికల్ ఫాంటసీ ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ లిస్ట్‌లో ఉంది. 98 నిమిషాల రన్‌ టైమ్ తో ఇయండిబిలో 5.8/10 రేటింగ్ ని పొందింది. 2014లో వచ్చిన ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Read Also : అందమైన పెళ్ళాం… పక్కకి తిరిగి పడుకొనే మొగుడు… అసలు మ్యాటర్ అతడితోనే

స్టోరీ ఏమిటంటే

న్యూయార్క్‌లో చెప్పులు కుట్టే షాపు నడిపే మాక్స్ బోరింగ్ లైఫ్ గడుపుతుంటాడు. ఉన్న ఒక్కగానొక గర్ల్ ఫ్రెండ్ కూడా దూరమవుతుంది. దీనికి తగ్గట్టు చెప్పులు కుట్టే మిషన్ కూడా చెడిపోతుంది. దీంతో అతనికి లైఫ్ మీద చిరాకు వస్తుంది. ఒక రోజు తాత వాడిన పాత మ్యాజికల్ స్టిచింగ్ మెషిన్ బయట పెడతాడు. దానిలో ఒక పెద్ద రహస్యం ఉంది. దానితో కుట్టిన చెప్పులు ఎవరివైతే ఉంటాయో ఆ చెప్పులు వేసుకుంటే మాక్స్ ఆ వ్యక్తి రూపంలోకి మారిపోతాడు. ఒక చైనీస్ వ్యక్తి చెప్పులు కుట్టాక అసలు విషయం అతనికి అర్థం అవుతుంది. ఆ చెప్పులు వేసుకుని మొదట చైనీస్ అంకుల్‌గా, ఆ తరువాత బ్యూటిఫుల్ అమ్మాయిగా మారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత గ్యాంగ్‌ స్టర్ లూడ్లో రూపంలోకి మారి, రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని ట్రై చేస్తాడు. ఫ్రెండ్ జిమ్మీతో కలిసి డబ్బులు దొంగిలించి పేదవాళ్లకి పంచుతాడు.

Advertisement

ఇప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్ కార్మెన్‌తో క్లోజ్ అవుతాడు, తల్లి రూపంలోకి మారి ఎమోషనల్ అవుతాడు. చివరికి గ్యాంగ్‌ స్టర్ మాక్స్‌ని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తే, ఆ సమయంలో మాక్స్ అతని చెప్పులు వేసుకుని అతని రూపంలోకి మారి గ్యాంగ్‌ని పోలీసులకి పట్టిస్తాడు. క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. షాపులో కొత్త కస్టమర్ వస్తాడు. అది అతని తండ్రి రూపం. అతను చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ మ్యాజికల్ మెషిన్ వల్ల ఇన్నాళ్లూ వేరే రూపాల్లో జీవించాడు. ఈ మిషిన్ మన ఫ్యామిలీ గిఫ్ట్, దీనిని మంచి కోసమే వాడు అని చెప్పి అతను మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ స్వీట్ మ్యాజికల్ జర్నీ ఇలా ముగిసిపోతుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×