// // Dhanush-Mrunal Thakur- డేటింగ్‌ రూమర్స్‌.. రిలేషన్‌పై ఇలా హింట్‌.. -->
E-Paper
Advertisement

Dhanush-Mrunal Thakur: డేటింగ్‌ రూమర్స్‌.. రిలేషన్‌పై ఇలా హింట్‌.. ఇక ఓపెన్‌ అయినట్టేనా?

Dhanush-Mrunal Thakur: డేటింగ్‌ రూమర్స్‌.. రిలేషన్‌పై ఇలా హింట్‌.. ఇక ఓపెన్‌ అయినట్టేనా?
Advertisement

Dhanush-Mrunal Thakur Dating: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటి వరకు విడాకులు, నయనతార బయోపిక్‌ వివాదంతో తరచూ వార్తల్లో నిలిచిన ధనుష్‌ డేటింగ్‌ రూమర్స్‌తో హాట్‌ టాపిక్‌ అవుతున్నాడు. ధనుష్‌, మరాఠి భామమృణాల్ ఠాకూర్ ఇద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని, వీరిద్దరు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. వీరి తీరు చూస్తుంటే ఈ వార్తలు నిజమే అన్న సందేహం కూడా కలుగుతోంది. వీరిద్దరి రిలేషన్స్‌పై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, ఇప్పటి వరకు ఈ వార్తలను వీరు ఖండించలేదు. వీరిద్దరికి సంబంధించి ఎలాంటి సెలబ్రేషన్స్‌ అయిన వీళ్లు కనిపిస్తున్నారు.

మృణాల్ పార్టీలో ధనుష్‌ ఫ్యామిలీ

Advertisement

ఈ మధ్య మృణాల్ ఠాకూర్ కూడా ధనుస్‌ ఫ్యామిలీతో సన్నిహితంగా కనిపిస్తుంది. ఇటీవల మృణాల్ బర్త్‌డే పార్టీ నిర్వహించింది. కేవలం సన్నిహితులు, కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం ఆమె బర్త్‌ డే పార్టీకి హాజరయ్యారు. అందులో ధనుష్‌, అతడి ఫ్యామిలీ కూడా ఉంది. అంతేకాదు ధనుష్‌ సోదరిని ఇన్‌స్టా అకౌంట్‌ని మృణాల్ ఫాలో అవ్వడం, ఒకరి బర్త్‌డే ఒకరు విష్‌ చేసుకోవడం ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అప్పటి నుంచి వీరిద్దరి డేటింగ్‌ రూమర్స్‌ ఊపందుకున్నాయి. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఒకరి పోస్ట్‌కి ఒకరు లైక్స్‌ కొట్టుకోవడం, కామెంట్స్‌ చేసుకోవడం చేస్తున్నారు. ఇటీవల మృణాల్ లేటెస్ట్‌ మూవీకి సంబంధించిన లీజర్‌ రిలీజ్‌ అవ్వగా.. ఇందులో తన పర్ఫామెన్స్‌ కొనియాడుతూ ధనుష్‌ ఆమె పోస్ట్‌కి కామెంట్‌ చేశాడు. దీనికి ఆమె కేరింగ్‌ ఎమోజీతో పాటు లవ్‌ ఎమోజీని జత చేస్తూ ధనుష్‌ కామెంట్‌కి రిప్లై ఇచ్చింది. ఇది కూడా నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

సీక్రెట్‌ డేటింగ్

దీనితో మళ్లీ ధనుష్‌-మృణాల్‌ లు ప్రేమలో మునిగితేలుతున్నారని, అందుకే ఈ సాన్నిహిత్యమంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులు కాలేదు.. అప్పుడే ధనుష్‌ పోస్ట్‌కి మృణాల్ ఓ స్వీట్‌ కామెంట్‌ పెట్టింది. తాజాగా ధనుష్‌ తేరే ఇష్క మే మూవీకి సంబంధించిన తన లుక్‌ షేర్‌ చేస్తూ ఈ మూవీ జ్ఞపకాలను, ఈ చిత్రంతో ఉన్న అనుబంధాన్ని షేర్‌ చేసుకున్నాడు. దీనికి వెంటనే మృణాల్ ఓ కామెంట్‌తో తన అభిప్రాయన్ని బయటపెట్టింది. “ధనుష్‌ సర్‌.. ఇది ఎంత అందమైన ప్రయాణం. బ్లాక్‌బస్టర్!! సంస్కృతి!!! లెగసీ!!” అంటూ కామెంట్‌ చేసింది. దీనికి ధనుష్‌ రెండు హగ్‌ ఎమోజీలను జత చేసి వైట్‌ లవ్‌ ఎమోజీని జత చేశాడు. ఇలా మృణాల్ కామెంట్‌కి ధనుస్‌ ఎమోషనల్‌ అవ్వడం చూసి వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అన్నది నిజమే అని ఫిక్స్‌ అవుతున్నారు. వీరిద్దరు ఎప్పుడు ఎవరూ ఎలాంటి పోస్ట్‌ పెట్టి ఒకరినొకరు కామెంట్స్‌ అభినందించుకుంటున్నారు. అంటే నిజంగానే ధనుష్‌-మృణాల్‌లో ప్రేమలో మునిగితేలుతున్నారా.. అని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ వీడియో.. బ్యాగ్రౌండ్‌లో రష్మిక వాయిస్‌.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌

ఇలా బయపెడుతున్నారా?

రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఈ రకంగా అందరికి హింట్‌ ఇస్తున్నారా? అనే కూడా సందేహిస్తున్నారు. ఎందుకంటే వారిపై వస్తున్న రూమర్స్‌ని ఖండించడం లేదు. ఇలా పోస్టులకు కామెంట్స్‌ చేసుకుంటూ నెటిజన్ల చేతికి చిక్కుతున్నారు. ఇది కావాలని చేస్తున్నారా? లేదా అనుకోకుండ జరుగుతుందా?. కానీ వీరిద్దరు నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ పరోక్షంగా తమ రిలేషన్‌పై మాత్రం హింట్‌ ఇస్తున్నారంటూ చర్చ జరుగుతుంది. ఏదేమైనా కానీ, వీరిద్దరి రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు ఇలాంటి పోస్ట్స్‌, కామెంట్స్‌ రోజురోజుకి మరింత బలాన్ని ఇస్తున్నాయి. మరి వీటిని ఈ రూమర్డ్‌ కపుల్‌ నిజం చేస్తారా? వార్తలకే పరిమితం చేస్తారా? చూడాలి. కాగా ధనుష్‌కి ఇదివరకే పెళ్లై ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యని ప్రేమ వివాహం చేసుకున్నారు. 18 ఏళ్లు అన్యొన్యంగా జీవించిన వీరు 2022లో విడాకులు ప్రకటించి షాకిచ్చారు. 2024లో కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×