E-Paper
Advertisement

OTT Horror: బాబోయ్.. ఒక్క కాల్‌తో ప్రాణాలు పోతాయ్! .. మిస్ అయితే రిస్కే!

OTT Horror: బాబోయ్.. ఒక్క కాల్‌తో ప్రాణాలు పోతాయ్! .. మిస్ అయితే రిస్కే!
Advertisement

The Call :భయమేస్తుందని హారర్ సినిమాలు చూడటం ఆపేయలేం కదమ్మా అంటాడు జులాయ్ లో MS. చూస్తె భయమేస్తుంది.కాని చూడాలనిపిస్తుంది.హారర్ సినిమాలకున్న ఇంపాక్ట్ అలాటింది.మరి లేటెస్ట్ గా మిమ్మల్ని భయపెట్టడానికి వచ్చేస్తున్న ఆ హర్రర్ సినిమా ఏంటో తెలుసా .. ది కాల్’ (The Call).

ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత 

Advertisement

వరల్డ్ వైడ్ గా ఉన్న హారర్ లవర్స్‌ను వణికించిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ ఇది. 2020 అక్టోబర్ 2న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజై సంచలనం సృష్టించిన ఈ చిత్రం,ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత  ఇవాళ శనివారం (ఏప్రిల్ 11, 2026) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయిపొయింది.అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్‌లోనే కాదండోయ్ ..తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రావడం విశేషం.

కథ విషయానికి వస్తే

Advertisement

ఇక ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు టిమోతీ వుడ్ వర్డ్ జూనియర్ దర్శకత్వం వహించగా, హారర్ సినిమాల స్పెషలిస్ట్, ‘ఇన్సిడియస్’ ఫేమ్ లిన్ షేయ్,’సా’ (Saw) సిరీస్ ఫేమ్ టాబిన్ బెల్, రషింగ్, చెస్టర్ రాషింగ్ వంటి హాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించడం విశేషం.మరి హారర్ లవర్స్‌ వెన్నులో వణుకు పుట్టించిన ఈ  ది కాల్ సినిమా కథేంటో క్విక్ గా చూసేద్దామా..కథ విషయానికి వస్తే ఎడిత్ అనే మహిళ ఒక చిన్న టౌన్‌లో టీచర్‌గా పని చేసి  రిటైర్ అయి ఉంటుంది.అయితే ఆ  ఊర్లోని పిల్లలంతా ఎడిత్  ని మంత్రగత్తే అంటూ ఆటపట్టిస్తుంటారు.అలా క్రిస్, టోంకా, బ్రూనో, జాక్ అనే నలుగురు స్నేహితులు ఆమెను దారుణంగా వేధించడంతో ఎడిత్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది.

ఇక ఆమె చనిపోయిన తర్వాత ఆమె భర్త ఆ నలుగురు ఫ్రెండ్స్‌ను తన ఇంటికి పిలుస్తాడు. ఎడిత్ చనిపోయే ముందు ఒక వీలునామా రాసిందని, అందులోని ఒక ఛాలెంజ్ పూర్తి చేస్తే భారీగా డబ్బు ఇస్తానని ఆశపెడతాడు. ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా ..వారి ఇంట్లోని పాత ఫోన్ బూత్ నుంచి ఒక నంబర్‌కు కాల్ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ 60 సెకన్ల పాటు కాల్ కట్ చేయకుండా మాట్లాడాలి.అదీ వాళ్ళ ముందున్న చాలెంజ్ .

ఎడిత్ ఆత్మ వారిని ఎలా వేటాడింది?

దీంతో  డబ్బు మీద ఉన్న  పిచ్చితో ఆ నలుగురు ఒక్కొక్కరుగా ఆ ఫోన్ బూత్‌లోకి వెళ్తారు. కానీ కాల్ చేయగానే అవతలి వైపు నుంచి చనిపోయిన ఎడిత్ మాట్లాడుతుంది! ఆ క్షణం నుంచే ఆ నలుగురూ ఒక భయంకరమైన మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ 60 సెకన్లలో ఎడిత్ ఆత్మ వారిని ఎలా వేటాడింది? అసలు ఆ కాల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అన్నదే ది కాల్’ (The Call)సినిమా కథ. మరి తెరమీద ఆ కుర్రాళ్ళు ఆ చాలెంజ్ ని ఎలా ఫేస్ చేశారో, ఎడిత్ ఆత్మ వారిని ఎలా వేటాదిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి లాగిన్ అయిపోండి.

also read:OTT Thriller: మైండ్ బ్లోయింగ్ టైమ్ లూప్ థ్రిల్లర్.. మలయాళ సూపర్ హిట్ ఇక తెలుగులో! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×