E-Paper
Advertisement

OTT Movie : స్టూడెంట్‌తో ప్రొఫెసర్ పాడు పని… 6 భాషల్లో ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌

OTT Movie : స్టూడెంట్‌తో ప్రొఫెసర్ పాడు పని… 6 భాషల్లో ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌
Advertisement

OTT Movie : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఒక హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. యేల్ యూనివర్సిటీ నేపథ్యంలో జరిగే ఈ థ్రిల్లర్, గత నెల థియేటర్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రొఫెసర్, స్టూడెంట్ మధ్య ఏర్పడే టెన్షన్ సెక్షువల్ అబ్యూజ్ తో ఈ కథ ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. చూస్తున్నంత సేపు గుండెల్లో గుబులు రేపుతుంటుంది ఈ స్టోరీ. థియేట్రికల్ రన్ తరావుత, నెల రోజుల్లోనే ఒకేసారి ఆరు భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో అంటే

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆఫ్టర్ ది హంట్’. లూకా గ్వాడనినో దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో జూలియా రాబర్ట్స్, ఆయో ఎడెబిరి, ఆండ్రూ గార్ఫీల్డ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 6 భాషల్లో వచ్చిన ఈ షాకింగ్ స్టోరీ 2025 అక్టోబర్ 10న థియేటర్స్‌లో విడుదలై, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 6 భాషల్లోఅందుబాటులో ఉంది. ఐయండిబిలో ఈ మూవీ 6.3 రేటింగ్ ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ప్రతిష్టాత్మకమైన యేల్ యూనివర్సిటీలో అల్మా అనే ఫిలాసఫీ ప్రొఫెసర్ అందరి చేత గౌరవించబడుతుంటుంది. అదే సమయంలో ఆమెకు పీహెచ్‌డీ విద్యార్థినిగా ఉన్నమాగీ అనే యువతి ఆమెను దేవతలా ఆరాధిస్తుంది. కానీ ఒక రోజు ఆమె అల్మా కొలీగ్ అయినటువంటి ప్రొఫెసర్ హ్యాంక్ మీద సెక్సువల్ అసాల్ట్ కేసు పెడుతుంది. అతను అదే సమయంలో ఆల్మాతో పాటు చీఫ్ ప్రొఫెసర్ పదవికి పోటీ పడుతుంటాడు. ఇప్పుడు ఈ కేసు అల్మా జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

Read Also : మంత్రగత్తె వల్ల ముప్పు… చేతబడితో భయపెట్టే సిరీస్… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్

ఈ సంఘటన వల్ల క్యాంపస్‌లో ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఆల్మా తన స్నేహితుడి వాదనకు, విద్యార్థిని ఆరోపణల మధ్య నలిగిపోతుంది. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, ఆల్మా గతం నుండి ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఆమె కెరీర్‌కు, ప్రతిష్టకు ప్రమాదం కలిగిస్తుంది. దీంతో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆల్మా సీక్రెట్ ఏమిటి ? గతాన్ని, ప్రస్తుత సమస్యలను ఆమె ఎలా పరిష్కరించుకుంటుంది ? మాగీ చేసిన ఆరోపణలు నిజమా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×