E-Paper
Advertisement

Thamma OTT Release : ఓటీటీలోకి రష్మిక రొమాంటిక్ కామెడీ హర్రర్ ‘థామా’… స్ట్రీమింగ్ డేట్ ఇదే ?

Thamma OTT Release : ఓటీటీలోకి రష్మిక రొమాంటిక్ కామెడీ హర్రర్ ‘థామా’… స్ట్రీమింగ్ డేట్ ఇదే ?
Advertisement

Thamma OTT Release : ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందన్న నటించిన చిత్రం “థామ”. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాని మెచ్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇది మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. థియేటర్లలో విడుదలైన హిందీ సినిమాలు, ఎనిమిది వారాల లోపు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్‌లో థామా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో ప్రసారం కానుంది.  స్ట్రీమింగ్ కి ఒక డేట్ కూడా ప్రకటించేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తో నడవనుంది. ఇది ఏ ఓటీటీలోకి రానుంది ? దీని స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘థామా’ (Thamma) 2025లో విడుదలైన హిందీ రొమాంటిక్ కామెడీ హర్రర్ సినిమా. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించగా ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్న, నవాజుద్దీన్ సిద్ధికి, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను 2025 ఆగష్టు 19న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేయగా, సినిమాను అక్టోబర్ 21న విడుదల చేశారు. ఇక ఈ హర్రర్ కామెడీ డిసెంబర్ 16న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటన కూడా వచ్చింది. దీంతో థియేటర్లలో చూడని వాళ్ళు, రష్మికా ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తునారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా ప్రాచీన కాలం నాటి ‘బేతాల్’ ( ఒక రకమైన రక్త పిశాచులు) అనే జీవుల కథతో నడుస్తుంది. 323 BCలో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశంపై దండెత్తినప్పటి సన్నివేశాలతో మొదలవుతుంది. అక్కడ అతను యాక్షాసన్ అనే పురాతన రక్త పిశాచి బారిన పడతాడు. ఆతరువాత కథ ప్రజెంట్ కి మారుతుంది. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) అనే ఒక టీవీ రిపోర్టర్, సంచలన వార్తల కోసం వెతుకుతూ స్నేహితులతో కలిసి అడవిలో ట్రెకింగ్‌కు వెళ్తాడు. అక్కడ అతనిపై ఒక ఎలుగుబంటి దాడి చేస్తుంది. తీవ్రంగా గాయపడిన అలోక్‌ను తాడక (రష్మిక మందన్న) అనే ఒక మిస్టీరియస్ స్త్రీ రక్షిస్తుంది.

Read Also : ఒక్క నైట్ లో వణుకు పుట్టించే సీన్లు… 10 మందికి అదే గతి… మెంటలెక్కించే క్లైమాక్స్ ట్విస్ట్

Advertisement

తాడక ఒక ‘బేతాల్’ (మహిళా రక్త పిశాచి). అయితే తాడక, ఆమె తెగ చాలా సంవత్సరాల క్రితమే మానవ రక్తాన్ని తాగడం మానేశారు. అలోక్‌ను రక్షించే క్రమంలో, తాడక అతన్ని కరిచి, అతన్ని కూడా బేతాల్‌గా మారుస్తుంది. ఈ సమయంలో అలోక్, తాడక మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ వాళ్ళ ప్రపంచానికి, మానవ ప్రపంచానికి మధ్య ఉన్న నియమాల కారణంగా, ఈ ప్రేమ ప్రమాదంలో పడుతుంది. మరోవైపు యాక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) అనే క్రూరమైన ప్రాచీన బేతాల్, తాడక తెగకు ద్రోహం చేసి, మానవాళిపై తన రక్త దాహాన్ని తీర్చుకోవాలని చూస్తాడు. చివరికి అలోక్, తాడకతో కలిసి యాక్షాసన్ బారి నుండి తమను తాము, మానవ ప్రపంచాన్ని ఎలా రక్షించుకున్నారు? అలోక్ తన కొత్తగా వచ్చిన శక్తులను ఎలా ఉపయోగించాడు? అనే దాని చుట్టూ మిగిలిన కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×