E-Paper
Advertisement

Spirit: సందీప్ రెడ్డి భారీ ప్లానింగ్, ఏకంగా 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు

Spirit: సందీప్ రెడ్డి భారీ ప్లానింగ్, ఏకంగా 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు
Advertisement

Spirit: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత చేసిన అన్ని సినిమాల్లో కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలయ్యాయి. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమా 1000 కోట్లు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది.

ఏకంగా 20 మంది అసిస్టెంట్లు 

Advertisement

సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేస్తున్న స్పిరిట్ సినిమాకి ఏకంగా 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారట. వీరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మనోజ్ కూడా ఉన్నారు. అలానే రవితేజ తనయుడు మహదన్ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకో 18 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు.

ఇంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ తో సినిమాని త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డాడు సందీప్ రెడ్డి వంగ. సినిమా మొదలుపెట్టడానికి కొంచెం టైం తీసుకుంటాడు గాని ఒకసారి సినిమా మొదలైపోతే దానిని త్వరగా పూర్తిచేసే పనిలో ఉంటాడు. అనిమల్ సినిమాలు కూడా దాదాపు 100 రోజుల్లో ఫినిష్ చేశాడు.

మ్యూజిక్ రెడీ 

Advertisement

సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో మ్యూజిక్ ఎంత కీలకంగా ఉంటుందో వచ్చిన సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. స్పిరిట్ సినిమాకి సంబంధించి దాదాపు 70% మ్యూజిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సినిమా సెట్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేస్తున్నారు షూటింగ్ చేస్తూ ఉంటాడు.

ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో విపరీతమైన అంచనాలను పెంచింది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కూడా కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ మంత్ ఎండింగ్ నుంచి మొదలుకానున్నట్లు రీసెంట్గా జిగ్రీస్ సినిమా ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగ కన్ఫర్మ్ చేశాడు.

Also Read: Globetrotter : రాజమౌళి కీరవాణి లను కింద కూర్చోబెట్టిన సుమ, రియల్ లైఫ్ శివగామి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×