E-Paper
Advertisement

Survival Thriller OTT : 2000 ఎత్తున్న టవర్ పై ఇద్దరే అమ్మాయిలు… ఒక్కో టర్న్ కి గుండె జారిపోద్ది… నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ కే పోతారు భయ్యా

Survival Thriller OTT : 2000 ఎత్తున్న టవర్ పై ఇద్దరే అమ్మాయిలు… ఒక్కో టర్న్ కి గుండె జారిపోద్ది… నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ కే పోతారు భయ్యా
Advertisement

Survival Thriller OTT : ఓటీటీలో ఒక సర్వైవల్ సైకలాజికల్ థ్రిల్లర్ సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తోంది. ఇది హైట్ ఫియర్ ను ఉత్కంఠంగా చూపిస్తుంది. ఈ చిత్రం 2,000 అడుగుల ఎత్తైన టెలివిజన్ టవర్‌ పైభాగంలో చిక్కుకుపోయిన ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మరి దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే

2022లో విడుదలైన ఈ సర్వైవల్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘ఫాల్’ (Fall). దీనికి స్కాట్ మాన్ దర్శకత్వం వహించగా, గ్రేస్ కరోలిన్ కర్రీ, వర్జీనియా గార్డనర్, మాసన్ గూడింగ్, జెఫ్రీ డీన్ మోర్గాన్ నటించారు. ఇది 2022 ఆగస్టు 12న లయన్స్‌గేట్ ఫిల్మ్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో థియేటర్లలో విడుదలైంది. $3 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $21 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా Lionsgate Play, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెక్కీ తన భర్త డాన్‌ను ఒక క్లైంబింగ్ ప్రమాదంలో కోల్పోయి తీవ్రమైన బాధలో ఉంటుంది. ఆ బాధ నుండి ఆమెను బయటకు తీసుకురావడానికి, అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే ఆమె స్నేహితురాలు హంటర్ ఒక ప్లాన్ వేస్తుంది. అమెరికాలోని మొజావే ఎడారిలో ఉన్న 2,000 అడుగుల ఎత్తున్న ‘బి67’ అనే పాత టీవీ టవర్‌ను ఎక్కాలని టవర్‌ ప్రోపోజ్ చేస్తుంది. హంటర్ ఆమెను రిఫ్రెష్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఇక అతి కష్టం మీద వాళ్ళు టవర్ పైభాగానికి చేరుకుంటారు. కానీ ఇంతలోనే ఒక ప్రమాదం జరుగుతుంది.

వాళ్ళు తిరిగి కిందకు దిగబోతుండగా , ఆ టవర్ నిచ్చెన ఒక్కసారిగా కూలిపోతుంది. దీంతో భూమికి 2,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న ప్లాట్‌ ఫామ్‌పై ఎటూ వెళ్లలేక చిక్కుకుపోతారు. ఆ ఎత్తులో కనీసం ఫోన్ సిగ్నల్ కూడా అందదు. అక్కడ చిక్కుకుపోయిన బెక్కీ, హంటర్‌లు సహాయం కోసం ఎదిరుచూస్తారు. ఈ క్రమంలో బెక్కీకి తన స్నేహితురాలు హంటర్ గురించి ఒక నిజం తెలుస్తుంది. చివరకు బెక్కీ ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడింది ? హంటర్ గురించి బెక్కీ తెలుసుకున్న నిజం ఏమిటి ? అనేది ఈ చిత్రంలోని మిగతా కథ.

Advertisement

Read Also :  ఊరిని వణికించే వరుస హత్యలు… దున్నపోతు బలితో ఊహించని ట్విస్ట్… కితకితలు పెట్టే కామెడీ కూడా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×