E-Paper
Advertisement

Nuts For Liver Health: లివర్ హెల్త్ కోసం నట్స్.. ఎంత మోతాదులో తీసుకోవాలి ?

Nuts For Liver Health: లివర్ హెల్త్ కోసం నట్స్.. ఎంత మోతాదులో తీసుకోవాలి ?
Advertisement

Nuts For Liver Health: కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి ఆహారాన్ని శక్తిగా మార్చడం వరకు వందలాది పనులను ఇది నిర్వహిస్తుంది. అయితే.. మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ‘ఫ్యాటీ లివర్’ వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. కాలేయాన్ని కాపాడుకోవడానికి పండ్లు, కూరగాయలతో పాటు నట్స్ అద్భుతంగా పని చేస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఇ , ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయ కణాలను రక్షించడమే కాకుండా.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయ పడతాయి. లివర్ పనితీరును మెరుగపరిచే 5 రకాల నట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేయ ఆరోగ్యాన్ని పదిలపరిచే 5 రకాల నట్స్:

Advertisement

1.వాల్ నట్స్:
నట్స్ అన్నింటిలోనూ కాలేయానికి ‘వాల్‌నట్స్’ అత్యంత మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, గ్లూటాథియోన్ సమృద్ధిగా ఉంటాయి. కాలేయం రక్తాన్ని శుద్ధి చేసేటప్పుడు అమ్మోనియా వంటి వ్యర్థాలను తొలగించాల్సి ఉంటుంది. వాల్‌నట్స్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారిలో కాలేయ పనితీరును మెరుగు పరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

2.బాదం పప్పు:
బాదంలో విటమిన్-ఇ, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్-ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కాలేయ కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురై దెబ్బతినకుండా కాపాడుతుంది. రోజూ కొన్ని బాదం పప్పులను తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు నిల్వలు పెరగకుండా అడ్డుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

Advertisement

3. పిస్తా పప్పు:
పిస్తా పప్పులు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు. కాలేయానికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గినప్పుడు.. కాలేయంపై అదనపు కొవ్వు చేరే అవకాశం తగ్గుతుంది. కాలేయ వాపును తగ్గించడంలో పిస్తాలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కీలక పాత్ర పోషిస్తాయి.

4. జీడిపప్పు:
చాలామంది జీడిపప్పు తింటే కొవ్వు పెరుగుతుందని భయపడతారు. కానీ పరిమితంగా తీసుకుంటే ఇది కాలేయానికి చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, కాపర్ , మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కాలేయ ఎంజైమ్‌ల ఉత్పత్తికి అవసరం. జీడిపప్పులోని గుండెకు మేలు చేసే కొవ్వులు కాలేయం చుట్టూ పేరుకుపోయే చెడు కొవ్వును తగ్గించడంలో పరోక్షంగా సహాయపడతాయి.

5.పెకాన్ నట్స్ :
వాల్‌నట్స్ మాదిరిగానే ఉండే పెకాన్ నట్స్‌లో ఫినోలిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయానికి వ్యతిరేకంగా పని చేసే ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడం ద్వారా కాలేయంపై పనిభారాన్ని తగ్గిస్తాయి.

Also Read: వాల్‌‌నట్స్ కంటే ఎక్కువ ఒమేగా- 3 కావాలా ? అయితే ఈ 10 సూపర్ ఫుడ్స్ మీ డైట్‌లో ఉండాల్సిందే ?

నట్స్ తీసుకునేటప్పుడు గమనించాల్సిన జాగ్రత్తలు:

1.నట్స్ ఆరోగ్యకరమే అయినప్పటికీ.. వాటిని సరైన పద్ధతిలో తీసుకోవడం ముఖ్యం.

2. నట్స్‌లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకు 30 గ్రాములు (ఒక గుప్పెడు) మించి తీసుకోకూడదు. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది కాలేయానికి మంచిది కాదు.

3. ఉప్పు వేసిన, నూనెలో వేయించిన లేదా పంచదార కోటింగ్ ఉన్న నట్స్‌ను దూరంగా ఉంచాలి. పచ్చివి లేదా డ్రై రోస్ట్ చేసినవి మాత్రమే ఎంచుకోవాలి.

4. బాదం, వాల్‌నట్స్ వంటి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం తినడం వల్ల వాటిలోని ‘ఫైటిక్ యాసిడ్’ తొలగిపోయి, పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×