E-Paper
Advertisement

ప్రతి 30 ఏళ్లకు ఒకసారి కాలం ఆగిపోయే ఇల్లు… కట్ చేస్తే స్పైన్ చిల్లింగ్ సీన్స్

ప్రతి 30 ఏళ్లకు ఒకసారి కాలం ఆగిపోయే ఇల్లు… కట్ చేస్తే స్పైన్ చిల్లింగ్ సీన్స్
Advertisement

Supernatural horror film: అప్పుడప్పుడూ కాలం ఆగిపోతే ఎంత బాగుండు కదా అనిపిస్తుంది. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక టైమ్ లో ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. కానీ అలా కాలం ఆగిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ‘హౌస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ టైమ్’ (The House at the End of Time) అనే ఈ హర్రర్ మూవీని చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో మనం టైటిల్ లో చెప్పుకున్నట్టుగానే ఏకంగా ప్రతీ 30 ఏళ్ళకు ఒకసారి ఆ ఇంట్లో కాలం ఆగిపోయి, జరిగిన సీన్లు రిపీట్ అవుతుంటాయి. మరి అలాంటి ఘోస్ట్ హౌజ్ కి ఓ ఫ్యామిలీ ఎలా బలయ్యింది ? మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ హర్రర్ మూవీలో మన హీరోయిన్ పేరు ‘దుల్సే’. సినిమా మొత్తం ఈ గృహిణి చుట్టూనే తిరుగుతుంది. ఆమె తన భర్త జువాన్ జోస్, ఇద్దరు కొడుకులు లియోపోల్డో, రోడ్రిగోలతో కలిసి ఒక పాత పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ ఇల్లు ఎంతో అందంగా, భయంకరమైన చరిత్రతో ఉంటుంది. ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. ఆమె కళ్లెదుటే భర్త దారుణంగా హత్యకు గురవుతాడు, పెద్ద కొడుకు లియోపోల్డో గాల్లోకి ఎగిరి మాయమైపోతాడు. చేతిలో కత్తితో రక్తపు మడుగులో ఉన్న దుల్సేను పోలీసులు తన భర్త, కొడుకును చంపిన నేరస్థురాలిగా అరెస్ట్ చేస్తారు.

Advertisement

కోర్టు ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. శిక్షాకాలం పూర్తయ్యాక, ముసలిదైన దుల్సేను ఆమె వయసు రీత్యా అదే పాత ఇంట్లో ‘హౌస్ అరెస్ట్’లో చేస్తారు. ఆ ఇల్లు శాపానికి గురైందని, ఆరోజు రాత్రి తన కుటుంబాన్ని చంపింది తాను కాదని, ఏదో అదృశ్య శక్తి అని నిరూపించడానికి ఆమె ఒక స్థానిక క్యాథలిక్ ఫాదర్ సహాయం తీసుకుంటుంది. దుల్సే తో పాటు సదరు ఫాదర్ ఆ ఇంటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది.

ఆ ఘోస్ట్ హౌజ్ మామూలు ఇల్లు కాదు. కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఆ ఇంట్లోని కొన్ని గదులు… భవిష్యత్తుకు, గతానికి కనెక్ట్ అయ్యే ‘టైమ్ పోర్టల్స్’లా మారుతాయని గ్రహిస్తారు. దుల్సే ముసలి వయసులో ఆ ఇంట్లో ఉన్నప్పుడే మళ్లీ ఆ రోజు వస్తుంది. ఆమె అనుకోకుండా 30 ఏళ్ల వెనక్కి అంటే.. తన భర్త, పిల్లలు బతికున్న గతకాలంలోకి ప్రయాణిస్తుంది. అక్కడ ఆమెకు తెలిసే నిజం ఏంటంటే.. 30 ఏళ్ల క్రితం తనపై దాడి చేసిన ముసలి ముఖం లేని వ్యక్తి మరెవరో కాదు, భవిష్యత్తు నుండి వచ్చిన తానే అని. మరి ఈ జర్నీలో తన భర్త గురించి హీరోయిన్ కు తెలిసిన షాకింగ్ నిజం ఏంటి ? ఆమె చిన్న కొడుకును చంపింది ఎవరు ? తన భర్తను తానే ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది ? అన్న సస్పెన్స్ కు తెర దించాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

వెనిజులా సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ చిత్రం ‘ది హౌస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ టైమ్’. అలెజాండ్రో హిడాల్గో దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ ఎలిమెంట్స్‌తో పాటు మైండ్-బెండింగ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఉంటుంది. ప్రస్తుతం Netflix, Amazon Prime Videoలో ఒరిజినల్ స్పానిష్ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో లేదు కానీ ఇంగ్షీషు సబ్ టైటిల్స్ తో చూడవచ్చు.

Read Also: హైవేల పక్కన 14 మంది మహిళల శవాలు… వెన్నులో వణుకు పుట్టించే రియల్ మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×