E-Paper
Advertisement

Superhero horror series : వింత వైరస్ తో అంతుచిక్కని రోగం… మొక్కల రూపంలో భూమిని కాపాడే సూపర్ హీరో

Superhero horror series : వింత వైరస్ తో అంతుచిక్కని రోగం… మొక్కల రూపంలో భూమిని కాపాడే సూపర్ హీరో
Advertisement

Superhero horror series : సూపర్ హీరో స్టోరీలను పిల్లల నుంచి పెద్దల దాకా ఆసక్తిగా చూస్తుంటారు. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి స్టోరీలు ఇప్పటికీ ఒక సంచలనమే. అదే బాటలో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అయితే ఈ సిరీస్ సాధారణ సూపర్ హీరో కథలా కాకుండా, డార్క్ థీమ్ తో భయంకరంగా ఉంటుంది. మొక్కల రూపంలో ఉండే ఒక వ్యక్తి చుట్టూ కథ ఉంటుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

DC యూనివర్స్ కోసం గ్యారీ డాబర్‌మాన్, మార్క్ వెర్‌హీడెన్‌లు రూపొందించిన ఈ అమెరికన్ సూపర్ హీరో హర్రర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘స్వాంప్ థింగ్’ (Swamp Thing). ఈ సిరీస్ 2019 మే 31 నుంచి 10 ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ లో ఉంది. ఇక దాని ప్రీమియర్ తర్వాత DC యూనివర్స్ ‘స్వాంప్ థింగ్’ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. విమర్శకుల నుండి మంచి రేటింగ్స్ వచ్చినప్పటికీ, నిర్మాణ వ్యయం పెరగడం, బడ్జెట్ పరమైన ఇబ్బందుల వల్ల కేవలం ఒక సీజన్ తర్వాత ఈ సిరీస్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం ఇది prime videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  శవాలతో నిండిపోయే నది… వరుస హత్యలతో వణుకు పుట్టించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

లూసియానాలోని మరైస్ అనే పట్టణంలో ఒక వింతైన భయంకరమైన వైరస్ వ్యాపిస్తుంది. దీనిపై పరిశోధన చేయడానికి డాక్టర్ అబ్బీ ఆర్కేన్ ప్రయత్నిస్తుంటుంది. అక్కడ ఆమెకు జీవశాస్త్రవేత్త అలెక్ హాలండ్ పరిచయమవుతాడు. సారవంతమైన నేలల్లో ఎవరో అక్రమంగా రసాయనాలను కలుపుతున్నారని, దానివల్ల అక్కడి మొక్కలు అసాధారణంగా మారి మనుషులపై దాడి చేస్తున్నాయని అలెక్ గుర్తిస్తాడు. ఈ నిజాన్ని బయటపెట్టకుండా ఉండటం కోసం కొందరు దుండగులు అలెక్ పడవను పేల్చివేస్తారు. మంటల్లో చిక్కుకొని నీటిలో పడిపోయిన అలెక్, ఆ చిత్తడి నేలలోని అతీంద్రియ శక్తుల వల్ల ఒక భారీ చెట్టు రూపంలో ఉన్న ఒక రాక్షసుడిగా మారుతాడు.

Advertisement

అబ్బీ ఆర్కేన్ ఆ రాక్షసుడిలో ఉన్న మానవత్వాన్ని గుర్తించి, అతనికి అండగా నిలుస్తుంది. స్వార్థపరుడైన వ్యాపారవేత్త అవేరీ చేసే వింత ప్రయోగాలు నుండి తనను తాను కాపాడుకుంటూనే, ఆ పట్టణాన్ని రక్షించడానికి అతను పోరాడతాడు. చివరకు అతను ఎలాంటి పోరాటం చేస్తాడు ? అతను మళ్ళీ మనిషిగా మారతాడా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×