E-Paper
Advertisement

Social drama OTT : స్కూల్ పై పొలిటికల్ లీడర్ కన్ను… మాస్టారు ఇచ్చే ఝలక్ కు బుర్రబద్దలు

Social drama OTT : స్కూల్ పై పొలిటికల్ లీడర్ కన్ను… మాస్టారు ఇచ్చే ఝలక్ కు బుర్రబద్దలు
Advertisement

Social drama OTT : మరాఠీ సినిమా ప్రియులకు శుభవార్త. సంక్రాంతి సీజన్‌ లో థియేటర్లలో విడుదలై పాజిటివ్ రివ్యూలతో పాటు, ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకున్న సోషల్ డ్రామా ఒకటి ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. మనసుకు హత్తుకునే కథతో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాను ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో అందుబాటులో

‘క్రాంతిజ్యోతి విద్యాలయ్’ (Krantijyoti Vidyalay Marathi film) అనే హిట్ మరాఠీ మూవీ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్‌ గా అందుబాటులోకి రావడంతో మరాఠీ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హేమంత్ ధోమే దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామాలో సచిన్ ఖేడేకర్, అమీ వాఘ్, ప్రజక్తా కోలి, సిద్ధార్థ్ చందేకర్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. మరి మీకు కూడా మరాఠీ సినిమాలంటే ఇష్టం అయితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ మహారాష్ట్రలోని అలీబాగ్‌ లో 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక మరాఠీ మీడియం పాఠశాల చుట్టూ తిరుగుతుంది. ఈ పాఠశాలలో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం విద్యకు ప్రాధాన్యత పెరగడం, అందులో చదువుకునే పిల్లలు పెద్దగా లేకపోవడం వల్ల స్కూల్ ను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు జగ్‌తాప్ అంతర్జాతీయ సంస్థ నిర్మాణం కోసం ఈ పాఠశాలను కూల్చివేయాలని ప్రణాళికలు రచిస్తాడు. పాఠశాలతో లోతైన భావోద్వేగ సంబంధం ఉన్న ప్రిన్సిపాల్ దినకర్ షిర్కే (సచిన్ ఖేడేకర్) మాత్రం దానిని కాపాడటానికి తన శయశక్తులా ట్రై చేస్తాడు. అందుకోసం పూర్వ విద్యార్థులను కలుస్తాడు. గతంలో ఆ స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు వివిధ వృత్తుల్లో సెటిల్ అయ్యి ఉంటారు. అందులో కొందరు విజయవంతమైన వ్యాపారవేత్తలు, కొందరు సాధారణ ఉద్యోగులు.

Read Also : మొసలి వేట అమ్మాయి ఆట… థియేటర్లలోకి రాకముందే ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్

Advertisement

ఈ సంఘటనతో అందరూ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. పాఠశాలలో గడిపిన బాల్యం, ఉపాధ్యాయుల ప్రేమ, స్నేహాలు, చిన్న చిన్న సంఘటనలు వారిని మళ్లీ ఒక చోటికి తీసుకొస్తాయి. అందరూ కలిసి పాఠశాలను కాపాడటానికి పోరాడతారు. మరి పాత స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ పాఠశాలను ఎలా కాపాడుకున్నారు ? అసలు ప్రిన్సిపాల్ ఆ స్కూల్ ను ఎందుకు కూల్చవద్దు అనుకున్నాడు ? రాజకీయ నాయకుడికి ఎదురెళ్ళిన వీళ్ళకు ఏం జరిగింది ? అన్నది మూవీలో చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×