E-Paper
Advertisement

సిస్టమ్‌ను షేక్ చేసిన 10వ తరగతి అమ్మాయి… చదువు కోసం పట్టుబట్టే చిచ్చర పిడుగు

సిస్టమ్‌ను షేక్ చేసిన 10వ తరగతి అమ్మాయి… చదువు కోసం పట్టుబట్టే చిచ్చర పిడుగు
Advertisement

Social Drama OTT : సోషల్ మెసేజ్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు ప్రభావంతో ప్రజలకు కొంత వరకైనా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అలాంటి సినిమా గురించే చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాను నార్త్ ఇండియాలో జరిగిన కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా తీశారు. విద్యా శాఖలో జరిగే టాపర్స్ స్కామ్ ను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంతేకాదు అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో కూడా ఈ సినిమా చూపిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ వీడియోలతో పాపులర్ అయిన కాశికా కపూర్ ఈ సినిమాతోనే హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఈమె నటనకు విమర్శకుల నుండి మంచి మార్కులే పడ్డాయి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ సోషల్ డ్రామా మూవీ పేరు ‘ఆయుష్మతి గీత మెట్రిక్ పాస్’ (Aayushmati Geeta Matric Pass). ప్రదీప్ ఖైర్వార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కాశికా కపూర్ (గీత), అనుజ్ సైనీ (కుందన్), అతుల్ శ్రీవాస్తవ (గీత తండ్రి) లీడ్ రోల్స్ లో నటించారు.
2024 అక్టోబర్ 18న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టి పాజిటివ్ టాక్ తో నడిచింది. 2026 మార్చి 27 నుంచి JioHotstarలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వారణాసి పక్కన ఉండే ఒక పల్లెటూర్లో గీత అనే అమ్మాయి ఉంటుంది. గీత అంటే ఆ ఊళ్లో అందరికీ ఇష్టమే. సరిగ్గా అదే టైంలో ఆమెకు ఒక మంచి పెళ్లి సంబంధం వస్తుంది. అబ్బాయి పార్టీ గట్టిదే, కానీ ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. పెళ్లికి ముందే గీత 10వ తరగతి పూర్తి చేయాలని పట్టుదలతో ఉంటుంది. గీత తండ్రి విద్యార్ధర్ పక్కా పంతం ఉన్న మనిషి. నా కూతురు మెట్రిక్ పాస్ అవ్వకుండా పెళ్లి చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్తాడు. అటు పెళ్లి కొడుకు కుందన్ ఏమో గీతను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆరాటపడతాడు. గీత కూడా తన తండ్రి గౌరవం కోసం, ఎలాగైనా చదివి పాస్ అవ్వాలని కష్టపడుతుంది. కానీ ఆమె చదివే స్కూల్లో, ఆ బోర్డులో పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు ఉంటాయి. పరీక్షలు రాయడం ఒకెత్తయితే, ఆ విద్యా వ్యవస్థలో ఉన్న స్కామ్‌లను ఎదుర్కోవడం గీతకు పెద్ద సవాలుగా మారుతుంది. చివరికి ఆమె పదవ తరగతి పాస్ అయిందా ? ఆమె పరీక్ష సమయంలో ఎదుర్కున్న స్కామ్ ఏమిటి ? కుందన్‌తో ఆమె పెళ్లి జరిగిందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఖాకీలకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… మూడు సీజన్లతో 7.9 ఐయండిబి రేటింగ్… నిజంగానే తోపు సిరీస్ మావా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×