E-Paper
Advertisement

క్రెడిట్ స్కోర్ పై క్రెడిట్ కార్డు ఎఫెక్ట్.. ఇవి జాగ్రత్తలు పాటించండి

క్రెడిట్ స్కోర్ పై క్రెడిట్ కార్డు ఎఫెక్ట్.. ఇవి జాగ్రత్తలు పాటించండి
Advertisement

Credit Card Usage: ప్రస్తుతం క్రెడిట్ కార్డులతో అనేక ప్రయోజనాలున్నాయి. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రివార్డు పాయింట్లు, ఆఫర్లు ఇలా ఖర్చులో కూడా ఆదా చేసుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డును చాలా జాగ్రత్తగా వాడుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే అది మీ సిబిల్ స్కోరును ఎఫెక్ట్ చేస్తుంది. లోన్ అర్హతను బ్యాంకులు సిబిల్ స్కోర్ తోనే అంచనా వేస్తాయి. అసలు క్రెడిట్ కార్డు, క్రెడిట్ స్కోర్ కు మధ్య సంబంధం ఏంటో వివరంగా తెలుసుకుందాం.

క్రెడిట్ హిస్టరీ

క్రెడిట్ స్కోర్ క్రెడిట్ హిస్టరీకి ప్రతిబింబించే ఒక సంఖ్య. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీ రుణ అర్హతను క్రెడిట్ స్కోర్ బట్టి అంచనా వేస్తాయి. ఇది మీ లోన్ రీపేమెంట్ విధానాన్ని సూచిస్తుంది. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన లోన్ నిబంధనలతో రుణాలు పొందవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లును గడువులోగా చెల్లిస్తుంటే.. మీ క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉంటుంది. మీ క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో ఇదొకటి. లేట్ పేమెంట్ లేదా డిఫాల్ట్‌లు మీ క్రెడిట్‌ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇలాంటి మిస్టేక్స్ తో మీ క్రెడిట్ స్కోరు పడిపోయే అవకాశం ఉంది. క్రెడిట్‌ కార్డు బిల్లులో కనీస మొత్తం కంటే తక్కువగా బిల్లు చెల్లిస్తుంటే, అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే.. కనీసం 6-8 నెలల పాటు రెగ్యులర్ గా కార్డు బిల్లులు, ఈఎంఐల చెల్లించాలి. దీంతో క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవచ్చు.

క్రెడిట్ కార్డు యుటిలైజేషన్ రేషియో

Advertisement

క్రెడిట్ కార్డు యుటిలైజేషన్ రేషియో(CUR)… క్రెడిట్ కార్డు వినియోగాన్ని తెలియజేస్తుంది. మీ సీయూఆర్ 30% కంటే తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. క్రెడిట్ కార్డును తక్కువగా వాడకం.. మీ ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. దీంతో క్రెడిట్ స్కోరుపై పాజిటివ్ ఎఫెక్ట్ ను చూపుతుంది. క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడితే అది మీ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుపై గరిష్ఠ పరిమితిని అందిస్తుంటాయి. కాబట్టి, మ్యాగ్జిమమ్ లిమిట్ ను మించి క్రెడిట్ కార్డును ఉపయోగించడం క్రెడిట్ స్కోరు తగ్గడానికి ఒక కారణం. మీ క్రెడిట్ కార్డును గరిష్ఠ పరిమితికి మించి ఎప్పుడూ ఉపయోగించవద్దు. మీరు రెండు క్రెడిట్ కార్డులు కలిగి ఉంటే.. లిమిట్ ను పెంచుకుని.. క్రెడిట్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

కొత్త క్రెడిట్ కార్డు అప్లై

కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసిన ప్రతిసారి, మీ క్రెడిట్ రిపోర్టుపై హార్డ్ ఎంక్వైరీ చేస్తారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువగా సార్లు మీ క్రెడిట్ స్కోర్ ను యాక్సెస్ చేస్తే వాటిని బ్యాంకులు ప్రతికూలంగా భావిస్తాయి. అవి మీ క్రెడిట్ స్కోర్‌ను కొంతవరకు తగ్గిస్తాయి. తరచూ క్రెడిట్ స్కోర్ ను యాక్సెస్ చేస్తే.. బ్యాంకులు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భావిస్తాయి. దీనివల్ల కూడా క్రెడిట్ స్కోరు ఎఫెక్ట్ అవుతుంది. తక్కువ సమయంలో అనేక సార్లు క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయవద్దు. ఒకవేళ అప్లై చేస్తే మీ అవసరాలకు సరిపోయే కార్డును సెలెక్ట్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావాన్ని తగ్గించడానికి, క్రెడిట్ కార్డు దరఖాస్తుల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి.

Advertisement

Also Read:  క్రెడిట్ కార్డు ఖర్చులు కంట్రోల్ ఉంచే 6 టిప్స్

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×