E-Paper
Advertisement

Silent Screems: శృతి హాసన్ వాయిస్ తో ‘సైలెంట్ స్క్రీమ్స్ ‘..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Silent Screems: శృతి హాసన్ వాయిస్ తో ‘సైలెంట్ స్క్రీమ్స్ ‘..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Silent Screems: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నిత్యం ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాయి. కొన్ని సినిమాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా యదార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. తాజాగా ఇదే నేపథ్యంలో మరో సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. తెలంగాణ లోని వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ త్రిల్లర్ ‘సైలెంట్ స్క్రీమ్స్ ‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యదార్థ సంఘటనల ఆధారంగా..

గత కొంతకాలంగా మహిళల పట్ల పెద్ద ఎత్తున జరుగుతున్న నేరాలు కేవలం సంఖ్యలగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సంఖ్యల వెనుక ఉన్న మనుషుల కథలను చెప్పడం కోసం ‘సైలెంట్ స్క్రీమ్స్ ‘(Silent Screems)అనే కథతో ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్(Sun Nxt) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ డాక్యుమెంటరీ, నేరాల ప్రభావం ఒక కుటుంబం పై సమాజంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయునున్నారు. ఇలాంటి ఒక క్రైమ్ డాక్యుమెంటరీ కి ప్రముఖ నటి శృతిహాసన్ (Shruthi Hassan)వాయిస్ ఓవర్ తో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మహిళలపై జరుగుతున్న నేరాలు..

Advertisement

మహిళలపై జరుగుతున్న నేరాలు నెంబర్లకు మాత్రమే పరిమితం కాకుండా న్యాయం కోసం చేసే పోరాటాన్ని, బాధితుల మౌనం వెనుక ఉన్న బాధను కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసమే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సిరీస్ సన్ నెక్స్ట్ లో ప్రసారంలో అందుబాటులోకి వచ్చింది.ఈ సిరీస్ ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నమని చెప్పాలి.

క్రైమ్ డాక్యుమెంటరీ..

Advertisement

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇప్పటికే సన్ నెక్స్ట్ లో జిగ్రీస్, ముఫ్తీ పోలీస్ వంటి వినోదాత్మకమైన సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఇలాంటి వినోదాత్మక కంటెంట్ తో పాటు ఆలోచన కలిగించే ఈ క్రైమ్ డాక్యుమెంటరీని సన్ నెక్స్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. క్రైమ్ నేపథ్యంలో సినిమాలను ఇష్టపడే వారు ఆలస్యం చేయకుండా సన్ నెక్స్ట్ లో సైలెంట్ స్క్రీమ్స్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. 4,000+ టైటిల్స్, 44+ లైవ్ ఛానళ్లతో, సన్ నెక్స్ట్ అన్ని వయసుల ప్రేక్షకులకు ఒకే వేదికగా నిలుస్తోంది.

Also Read: BMW Pre Release: రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×