E-Paper
Advertisement

Most Horrifying OTT Horror Film : రాత్రంతా రామ నామాన్ని జపించేలా చేసే 1 గంట 40 నిమిషాల హర్రర్ మూవీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

Most Horrifying OTT Horror Film : రాత్రంతా రామ నామాన్ని జపించేలా చేసే 1 గంట 40 నిమిషాల హర్రర్ మూవీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు
Advertisement

Most Horrifying OTT Horror Film : హారర్ సినిమా ప్రాంచైజీలోనే భయంకరమైన సినిమా Siccin గా చెప్పుకోవచ్చు. 2014లో మొదలైన టర్కిష్ సూపర్నాచురల్ హారర్ మూవీ సిరీస్ లో ఇప్పటివరకు 8 పార్ట్స్ వచ్చాయి. ప్రతి మూవీ సెపరేట్ స్టోరీ, కానీ థీమ్స్ సేమ్. ఇది హారర్ ఫ్యాన్స్‌కి కల్ట్ ఫేవరెట్ గా మారింది. దెయ్యాలు, బ్లాక్ మ్యాజిక్ థీమ్స్ తో వెన్నులో వణుకు పుట్టించే సీన్లు ఉంటాయి. ఒంటతిగా చుస్తే గుండె ఆగినట్టు ఉంటుంది. ఈ సినిమా ఎందులో చూడొచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ టర్కిష్ సూపర్నాచురల్ హారర్ మూవీ సిక్కిన్ (Siccîn) అల్పర్ మెస్ట్చీ డైరెక్షన్‌లో తెరకెక్కింది. ముహ్తెషెమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ నిర్మాణంలో 2014 సెప్టెంబర్ 26న విడుదలైంది. ఇందులో పినార్ చాగ్లార్ జెంచ్‌తుర్క్ (ఓజ్నూర్), కోరే షాహిన్‌బాష్ (కుద్రెత్), ఎబ్రు కాయ్మక్చీ (నిసా) వంటి నటులు నటించారు. ఇస్లామిక్ ఫోక్‌లోర్, బ్లాక్ మ్యాజిక్, జిన్నులు థీమ్స్‌పై ఆధారపడిన ఈ ఫిల్మ్, జెలసీ వల్ల వచ్చే భయంకరమైన పరిణామాలను చూపిస్తుంది. Prime video, hulu, Appletvలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఓజ్నూర్ అనే యువతి చిన్నప్పటి నుంచి తన కజిన్ కుద్రెత్‌పై లవ్ లో ఉంటుంది. కానీ కుద్రెత్ నిసా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటాడు. ఈ జెలసీలో ఓజ్నూర్ ఒక తంత్ర వైద్యుడి సహాయంతో భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. దీని ద్వారా నిసాను తొలగించి కుద్రెత్‌ను తనవైపు తిప్పాలని ప్లాన్ వేస్తుంది. ఈ స్పెల్ విజయవంతమవుతుందని అనుకుంటుంది, కానీ అది భయంకరంగా బ్యాక్‌ఫైర్ అవుతుంది. దెయ్యాలు రివర్స్ లో కుద్రెత్ కుటుంబాన్ని భయంకరంగా బాధపెడతాయి.

Read Also : అన్న హత్య తమ్ముడి వేట… బ్లడ్ బాయిల్ చేసే రివేంజ్… ట్రెండింగ్ లో కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

Advertisement

కుద్రెత్ కుటుంబం ఈ అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుపోతుంది. ఓజ్నూర్ తాను చేసిన తప్పును గ్రహిస్తుంది, కానీ ఆ తప్పును సరిచేయడానికి ఆలస్యం జరిగిపోయింది. ఈ స్పెల్ వల్ల వచ్చిన దెయ్యాలు కుద్రెత్ కుటుంబాన్ని, నిసాను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇక క్లైమాక్స్‌లో దెయ్యాల నుంచి బయట పడటానికి భయంకరమైన రిచ్యువల్ చేయడానికి పోరాటం మొదలవుతుంది. చివరికి ఈ దెయ్యాల నుంచి వీళ్ళు బయట పడతారా ? వాటికే బలవుతారా ? అనే విషయాలను, ఈ టర్కిష్ సూపర్నాచురల్ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×