E-Paper
Advertisement

Horror Movie OTT : బడిలో భయపెట్టే దెయ్యాలు… ఆత్మలతో మాట్లాడే అమ్మాయి… నిలువునా వణికించే హారర్

Horror Movie OTT : బడిలో భయపెట్టే దెయ్యాలు… ఆత్మలతో మాట్లాడే అమ్మాయి… నిలువునా వణికించే హారర్
Advertisement

Horror Movie OTT : ఓటీటీలో దెయ్యాల సినిమాలకు కొదవ లేదు. గుండెను గజ గజ వాణికించే స్టోరీలు బోలెడు. వీటికి ఫ్యాన్స్ కూడా అదే లెవెల్ లో ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సాగుతుంది. ఈ కథ ఒక స్కూల్ లో జరిగే వింత సంఘటనల చుట్టూ తిరుగుతుంది. అక్కడ మిస్టరీ ఛేదించే క్రమంలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. బెంగాలీ నుంచి వచ్చిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ బెంగాలీ హారర్ మిస్టరీ మూవీ పేరు ‘శోబ్ భూతురే’ (Shob Bhooturey). బిర్సా దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేష్ ఫిలింస్ బ్యానర్‌పై మహేంద్ర సోని నిర్మించారు. ఈ చిత్రంలో అబిర్ ఛటర్జీ, సోహిని సర్కార్, సుప్రియో దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2017 సెప్టెంబర్ 8న విడుదలైంది. ప్రస్తుతం hoichoi, Prime video ఓటీటీలలో ఈ హారర్ మూవీ అందుబాటులో ఉంది.

స్టోరీ మిటంటే

Advertisement

అనికేత్ అనే కుర్రాడికి దెయ్యాలంటే అస్సలు నమ్మకం ఉండదు. వాళ్ల నాన్న చనిపోయాక, ఆయన నడిపిన ‘షోబ్ భూతురే’ అనే దెయ్యాల మేగజైన్‌ను మూసేయాలని అనికేత్ అనుకుంటాడు. కానీ పత్రిక ఎడిటర్ అనికేత్‌ను ఒక చివరి కేసును పరిష్కరించమని కోరతాడు. కుసుంపూర్ అనే గ్రామంలోని ఒక పాఠశాలలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడి విద్యార్థులు భయంతో బడికి రావడం మానేస్తారు. ఆ గ్రామంలోని దెయ్యాల మిస్టరీని ఛేదించడానికి అనికేత్ బయలుదేరుతాడు.

అతనితో పాటు నందిని అనే అమ్మాయి కూడా వెళ్తుంది. ఆమెకు ఒక వింత లక్షణం ఉంటుంది. ఆమె కళ్ళు మూసుకుంటే దెయ్యాలు కనిపిస్తాయి, వాటితో మాట్లాడగలదు కూడా. అక్కడికి వెళ్ళాక అనికేత్ తన తెలివితేటలతో, నందిని తన శక్తులతో ఆ స్కూల్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఎలా కనిపెట్టారనేదే మెయిన్ స్టోరీ. ఇది మామూలు హారర్ సినిమాల్లా కేవలం భయపెట్టడమే కాకుండా, ఇందులో నాన్న సెంటిమెంట్ తో పాటు, కొన్ని లాజిక్ పాయింట్స్ కూడా ఉంటాయి. అసలు దెయ్యాల మీద నమ్మకం లేని హీరో, వాటిని చూడగలిగే హీరోయిన్ కలిసి ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Advertisement

Read Also : ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×