E-Paper
Advertisement

1 గంట 56 నిమిషాల ఈ థ్రిల్లర్ లో చివరి వరకు హంతకుడిని కనిపెట్టలేరు

1 గంట 56 నిమిషాల ఈ థ్రిల్లర్ లో చివరి వరకు హంతకుడిని కనిపెట్టలేరు
Advertisement

Crime Thriller OTT : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక భాష అనేది అసలు అడ్డుకోకుండా పోయింది. సౌత్ ఆడియన్స్ నార్త్, నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ ఇటీవలి సంవత్సరాలలో దక్షిణాది సినిమా కేవలం యాక్షన్, భారీ విజువల్స్‌కే పరిమితం కాకుండా, సస్పెన్స్ – థ్రిల్స్ విషయంలో మంచి మంచి సినిమాలు, సిరీస్ లతో అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మీకు కూడా దక్షిణాది చిత్రాలను చూడటం ఇష్టమైతే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం… ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సౌత్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ పేరు ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ (second case of seetharam). ఈ కన్నడ చిత్రానికి దేవి ప్రసాద్ రెడ్డి దర్శకత్వం వహించగా, విజయ్ రాఘవేంద్ర, గోపాలకృష్ణ దేశ్‌పాండే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. IMDbలో 6.7 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ కన్నడలోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రం “సీతారాం బినోయ్ కేస్ నెం. 18″కి సీక్వెల్. మొదటి భాగంలో ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి కథ ఉంటుంది. ఇప్పుడు రెండవ భాగంలో ఆ స్టోరీనే కంటిన్యూ అవుతుంది. క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ సిరీస్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో ట్రెండింగ్‌లో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఇదొక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. మొదటి పార్ట్‌లో పోలీస్ ఆఫీసర్ సీతారాం బినోయ్ ఒక చిన్న గ్రామంలోని కేసును సాల్వ్ చేస్తాడు. ఈ రెండో కేసులో మరింత క్లిష్టమైన మిస్టరీని అతను ఛేదించాల్సి వస్తుంది. ఈ సినిమా కథ సీతారాం బినోయ్ (విజయ్ రాఘవేంద్ర) సిటీకి ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కన్పించడం కలకలం రేపుతోంది. మొదట్లో అందరూ అది ఆత్మహత్య అనే అనుకుంటారు. కానీ సీతారాం మాత్రం బాగా పరిశీలించి అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ అనే విషయాన్ని కనిపెడతాడు.

Also Read : ఆ ఇంటిపై సూర్యరశ్మి పడితే అంతే సంగతులు… ఒళ్ళు గగుర్పొడిచే హార్రర్ మావా

Advertisement

ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతనికి ఆ అపార్ట్‌మెంట్‌ లో నివసించే అందరిపై అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఆ అమ్మాయితో ఏదో ఒక గొడవ జరుగుతుంది. లేదంటే సీక్రెట్ రిలేషన్ ఉంటుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో సీతారాంకు ఎదురవ్వని ఇబ్బంది ఉండదేమో. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకుని హంతకుడు సాక్ష్యాలను తారుమారు చేయడంతో పెద్ద తలనొప్పి అవుతుంది. అయితే మన పోలీస్ ఏమన్నా తక్కువ తిన్నాడా ? నగరంలో గతంలో జరిగిన కొన్ని అన్ సాల్వ్డ్ కేసులకు, ఈ హత్యకు సంబంధం ఉందని పట్టేస్తాడు. ఒకవైపు ఉన్నతాధికారుల ఒత్తిడి, మరోవైపు హంతకుడు విసిరే సవాళ్ల మధ్య సీతారాం తన తెలివితేటలతో ఒక్కో చిక్కుముడిని ఎలా విప్పాడనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని సినిమాను చూసే తెలుసుకోవాలి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×